Prabhas Fauji: ఆ సెంటిమెంటే 'ఫౌజీ' సినిమాకు మేజర్ హైలైట్‌.. ప్రభాస్‌కు మరో హిట్ పక్కనా?

Prabhas Fauji: ఫౌజీ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కు కూడా దర్శకుడు హను రాఘవపూడి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఫౌజీలో మదర్ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.

Rishvik
Published on: 19 March 2026 6:47 PM IST
Prabhas Fauji
X

Prabhas Fauji: ఆ సెంటిమెంటే 'ఫౌజీ' సినిమాకు మేజర్ హైలైట్‌.. ప్రభాస్‌కు మరో హిట్ పక్కనా?

Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2' వంటి భారీ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. మూడు పెద్ద సినిమాల షూటింగ్‌లను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ.. ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. వీటన్నింటిలో ముందుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం గట్టి పట్టుదలతో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ తన పూర్తి ఫోకస్‌ను 'ఫౌజీ' మూవీ పైనే పెట్టారు. ఆగష్టు నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగిన సమయం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతోంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కు కూడా దర్శకుడు హను రాఘవపూడి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఫౌజీలో మదర్ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.

ఫౌజీలో సీనియర్ నటి జయప్రద ప్రభాస్ తల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. తల్లి-కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌ను దర్శకుడు హను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. సినిమా చివరలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా.. పీక్ స్టేజ్‌లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు తోడు, హను రాఘవపూడి క్లాసిక్ టచ్ తోడైతే.. ఫౌజీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఫౌజీ కూడా అదే రేంజ్ హిట్ అందుకుంటుందని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. యుద్ధంలో పుట్టిన ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది.

Rishvik

Rishvik

Next Story