Sita Ramam: ఆ పాత్ర కోసం అనుకుంటే.. చివరిగా సీతగా మృణాల్.! కట్ చేస్తే!

Sita Ramam: సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ సీత పాత్రకు ఎలా ఎంపికైందన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

Ravi
By Ravi
Published on: 28 Oct 2026 9:30 AM IST
Sita Ramam
X

Sita Ramam: ఆ పాత్ర కోసం అనుకుంటే.. చివరిగా సీతగా మృణాల్.! కట్ చేస్తే!

Sita Ramam: సినీ పరిశ్రమలో ప్రముఖ చిత్రాలకు సంబంధించిన తెర వెనుక విషయాలు అలాగే నటీనటుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడూ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలలో ప్రధాన పాత్రల కోసం మొదట వేరే నటీనటులను సంప్రదించినప్పటికీ చివరికి వేరే వారు ఎంపిక కావడం లాంటి విషయాలు సినీ వర్గాలలో తెగ ట్రెండ్ అవుతుంటాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ సీతారామం సినిమాకు సంబంధించి నటి మృణాల్ ఠాకూర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ చిత్రంలో ఆమెను మొదట రష్మిక పోషించిన అఫ్రీన్ పాత్ర కోసం సంప్రదించారట. కానీ స్టోరీ చెప్పే సమయంలో డైరెక్టర్ హను తనను చూసి సీతా మహాలక్ష్మి పాత్రకు ఎంపిక చేసినట్లు మృణాల్ తాజాగా వెల్లడించారు.

హను భావోద్వేగాలతో కథను చెప్పిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ కథకు తాను బాగా కనెక్ట్ అయ్యానని గుర్తుచేసుకున్నారు. దర్శకులు చెప్పే కథా విధానం నటీనటుల మనసును ఎంతగా గెలుచుకుంటుందనేదానికి ఈ ఉదాహరణ నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సరైన సమయంలో దర్శకుడు తీసుకున్న ఈ నిర్ణయమే సినిమా విజయానికి ఎంతగానో దోహదపడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్ర విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియా వేదికగా మృణాల్ పంచుకున్న ఈ జ్ఞాపకాలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. అలాగే నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.