Naga Shaurya : నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్స్‌లో సందడి అప్పుడే!

మెలోడీ కింగ్ హారిస్ జయరాజ్ సంగీతం, నాగశౌర్య మాస్ యాక్షన్.. 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Ganesh
Published on: 28 March 2026 2:36 PM IST
Naga Shaurya : నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్స్‌లో సందడి అప్పుడే!
X

Naga Shaurya : టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ విడుదలకు రెడీ అవుతుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంతో రామ్ దేసి డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెలోడీ కింగ్ హారిస్ జయరాజ్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆయన అందించిన సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే థియేటర్స్‌లోకి వస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story