Akkineni Nagarjuna: వెండిరెర 'సోగ్గాడు'.. కింగ్ నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Akkineni Nagarjuna: నాగార్జున తన ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేశారు. కడుపునిండా ఆహారం తింటూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో వివరించారు.
Akkineni Nagarjuna: వెండిరెర 'సోగ్గాడు'.. కింగ్ నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున ఇవాళ 67వ ఏట అడుగుపెట్టారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ వయస్సులోనూ యవ్వనంగా కనిపించేందుకు ఆయన పాటించే డైట్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గతంలో అక్కినేని నాగార్జున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తన ఫిట్నెస్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్య రహస్యాలను అభిమానులతో పంచుకున్నారు. ఆరోగ్య సమస్యల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రూ. లక్షలు లేదా రూ. కోట్లు అనవసరంగా ఖర్చు చేయడం కంటే ముందే సరైన జీవనశైలి పాటించడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. తాను కేవలం 'మన్మధుడు' అనే బిరుదు నిలబెట్టుకోవడానికి లేదా గ్లామర్ కోసం మాత్రమే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం లేదని, శారీరకంగా మానసికంగా ఎల్లప్పుడూ బలంగా ఉండాలని స్పష్టం చేశారు. బ్రెయిన్ బహుశా ఎప్పుడూ చురుకుగా పనిచేయడానికి ఫిట్నెస్ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
డైట్ గురించి మాట్లాడుతూ తానెప్పుడూ బరువు తగ్గుతాను కదా అని కడుపు మాడ్చుకోనని, తనకు నచ్చిన అన్ని రకాల ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటానని నాగార్జున తెలిపారు. తాను రోజూ రాత్రి ఏడు గంటలకల్లా కచ్చితంగా డిన్నర్ పూర్తి చేస్తానని వెల్లడించారు. భోజనంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లటి అన్నం తిననని, దానికి బదులుగా బ్రౌన్ రైస్ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. దాంతో పాటు భోజనంలో నెయ్యి, మూడు రకాల ఆకుకూరలు, సలాడ్స్, చికెన్ లేదా ఫిష్, పెరుగు, ఇష్టమైన పచ్చడి ఇలా అన్నీ కలుపుకుని కడుపునిండా భోజనం చేస్తానని ఆయన వివరించారు. భోజనం విషయంలో తన శరీరాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని, ఏది తినాలో అది కచ్చితంగా తింటానని తెలిపారు.
అయితే ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తన ఫిట్నెస్ వెనుక ఉన్న ప్రధాన రహస్యం అని నాగార్జున స్పష్టం చేశారు. ఉదయం పూట జిమ్‌లో వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం స్థాయి బాగా పెరిగి, రోజంతా కూర్చున్నా సరే శరీరంలోని క్యాలరీలు బర్న్ అవుతూనే ఉంటాయని చెప్పారు. దాదాపు 35 ఏళ్లుగా తాను ఇదే దినచర్యను పాటిస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే రాత్రి పడుకునే ముందు రోజూ కనీసం ఒక చిన్న స్వీట్ తిననిదే తనకు అసలు నిద్ర పట్టదని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. రోజుకు రెండు రౌండ్ల మందు కూడా తీసుకుంటానని ఆయన ఓపెన్‌గా వెల్లడించారు. కాగా, ఇవాళ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన 100వ సినిమా టైటిల్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.




