Nagarjuna Hair Secret: నాగార్జున హెయిర్‌స్టైల్‌ రహస్యం... ఇదే కారణమన్న మేకప్‌మెన్‌

Nagarjuna Hair Secret: నాగార్జున జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండటం వెనుకనున్న సీక్రెట్స్‌ను పర్సనల్‌ మెకప్‌మెన్‌ రివీల్‌ చేశాడు.

Balachander
Published on: 26 April 2026 1:56 PM IST
Nagarjuna Hair Secret
X

Nagarjuna Hair Secret: నాగార్జున హెయిర్‌స్టైల్‌ రహస్యం... ఇదే కారణమన్న మేకప్‌మెన్‌

Nagarjuna Hair Secret: అక్కినేని నాగార్జున అంటే గుర్తుకు వచ్చేది మన్మథుడే. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన కింగ్‌లా కనిపిస్తాడు. ఇలా కనిపించడం వెనుక కేవలం మేకప్‌ మాత్రమే కాదు, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయని నాగార్జున వ్యక్తిగత మేకప్‌మ్యాన్‌ చంద్ర వెల్లడించారు. ఓ వయసు వచ్చాక జట్టు రాలిపోవడం సహజం. కానీ, జుట్టు రాలకుండా ఇప్పటికీ ఒత్తుగా దట్టంగా ఉండటానికి ఓ కారణం ఉందట. ప్రతిరోజూ ఉదయాన్నే నాగార్జున ఓ ప్రత్యేకమైన హెల్త్‌ జ్యూస్‌ తాగుతాడని చెబుతారు.

నేటికీ విగ్గు అవసరం లేని మన్మథుడు!

సినీ ఇండస్ట్రీలో మేకోవర్‌కు తగిన విధంగా విగ్గులు వాడటం సహజం. కానీ, 66 ఏళ్ల వయసులో కూడా నాగార్జున ఎటువంటి విగ్గు వాడకుండా సహజసిద్దంగానే జుట్టు పెంచుతాడట. అదీ కూడా ఒత్తుగా ఉంటుంది. ఒక్క అన్నమయ్య సినిమాలో మాత్రమే నాగార్జున విగ్గు వాడినట్టు చెబుతారు. ప్రతిరోజూ ఉదయం షూటింగ్‌కి రాగానే నాగ్‌ పెద్ద రాగి గ్లాస్‌ నిండా ఉసిరి, నిమ్మ, క్యారెట్‌, బీట్‌రూట్‌, పటికబెల్లం, తెనే కలిపిన జ్యూస్‌ను తాగుతారు. వీటిలోని ఔషధగుణాలు జట్టుకు అసలైన బలాన్ని ఇస్తాయిని మెకప్‌మెన్‌ తెలియజేశారుప

ఆయన భోజనం.. ఒక క్రమశిక్షణ!

నాగార్జున ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడో...క్రమశిక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మితాహారం ఆరోగ్యం అనే విధానాన్ని ఆయన తప్పకుండా పాటిస్తారు. వారంలో ఐదు రోజులు మితాహారమే. ఇక ఉదయం అల్పాహారంగా ఒక ఇడ్లీ వడ లేదా గారెను మాత్రమే తీసుకుంటారట. మధ్యాహ్నం భోజనం కూడా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటుంది. దంపుడు బియ్యంతో మెత్తగా వండిన అన్నం, బెండకాయ కూర, హాట్‌ చిప్స్‌తో భోజనం చేస్తారు. కానీ, వీకెండ్‌లో వెరీ స్పెషల్‌ ఫుడ్‌ ఉండాల్సిందే. శనివారం రాత్రి ఆయనకు ఇష్టమైన పాంప్లెట్‌ చేపలను తింటారు. అవికూడా మితంగా రెండు మాత్రమే. ఇక ఆదివారం రెండు లేదా మూడు ముక్కలు మటన్‌ లేదా చికెన్‌ను తీసుకుంటారు. ఆహారానికి ప్రాముఖ్యతతో పాటు పరిమితులు పాటించినపుడే ఆరోగ్యం కుదురుగా ఉంటుందని, ఏజ్‌ పెరిగినా నడుము గేజ్‌ మారదని చెబుతారు నాగార్జున.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story