Nandamuri Tejaswini : హీరోయిన్‌గా బాలకృష్ణ కూతురు.. అలాంటి సినిమాతో ఎంట్రీ

Nandamuri Tejaswini: నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Naresh.k
Published on: 1 Aug 2026 3:22 PM IST
Nandamuri Tejaswini
X

Nandamuri Tejaswini : హీరోయిన్‌గా బాలకృష్ణ కూతురు.. అలాంటి సినిమాతో ఎంట్రీ

Balakrishna Daughter: నందమూరి అభిమానులకు, సినీ ప్రియులకు ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని త్వరలోనే నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ సినీ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది. అయితే, రొటీన్ కమర్షియల్ సినిమాలతో కాకుండా, ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు సమాచారం.

సాధారణంగా నందమూరి కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఉంటే మాస్ ఫ్లేవర్, విపరీతమైన ఎలివేషన్స్ ఉన్న కథలను ఊహిస్తారు. కానీ తేజస్విని మాత్రం ఒక ప్రయోగాత్మక, యూత్‌కి స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు, ప్రీ-స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నాయని వినికిడి. కథ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యాక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కాళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే, ఊహించని విధంగా అందరికంటే ముందే తేజస్విని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుందనే వార్త వినగానే బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

గతంలో బాలకృష్ణ పాల్గొన్న పలు ఈవెంట్స్, టాక్ షోల నిర్వహణలో వెనుక ఉండి నడిపించిన తేజస్వినికి సినిమా నిర్మాణంతో పాటు గ్లామర్ ప్రపంచంపై మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఏకంగా వెండితెరపై ఒక స్ఫూర్తిదాయకమైన క్రీడా నేపథ్య పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తుండటంతో, టాలీవుడ్‌లో మరో పవర్‌ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌గా ఇది నిలవబోతుందనడంలో సందేహం లేదు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story