Samantha: సమంత గర్భవతి అని తెలిశాక నందిని రెడ్డి ఏం చేశారు?
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, క్రియేటివ్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Samantha: సమంత గర్భవతి అని తెలిశాక నందిని రెడ్డి ఏం చేశారు?
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, క్రియేటివ్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఓ బేబీ' వంటి విజయాల తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన 'మా ఇంటి బంగారం' చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో, తాజాగా ఓ ప్రముఖ ఛానల్ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న దర్శకురాలు నందిని రెడ్డి, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన , ఎమోషనల్ రహస్యాన్ని బయటపెట్టారు.
సెట్‌లో ఆ విషయం తెలిసిన ఏకైక వ్యక్తి నందిని రెడ్డే!
సినిమా థాంక్యూ మీట్‌లో సమంత తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ గుడ్ న్యూస్ షూటింగ్ సమయంలోనే తనకు తెలిసిందని నందిని రెడ్డి వెల్లడించారు. "మా ఇంటి బంగారం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే సామ్ కన్సీవ్ అయ్యిందనే విషయం తెలిసింది. ఆ తీపి కబురు ఆ సమయంలో సెట్‌లో నాకు మాత్రమే తెలుసు. విషయం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం" అని నందిని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
హెల్త్ పరంగా భారీ జాగ్రత్తలు..
"అదృష్టవశాత్తూ, అప్పటికే సినిమాలో ఉన్న పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ పూర్తయిపోయాయి. ఒకవేళ అవి మిగిలి ఉంటే ఇబ్బంది అయ్యేదేమో, కానీ లక్కీగా ఆ పని అప్పుడే అయిపోయింది. ఇక ఆ తర్వాత మిగిలిన షూటింగ్ మొత్తం సామ్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాం. ఆమెకు ఏమాత్రం అలసట కలగకుండా చూసుకుంటూ, తగినంత విశ్రాంతి ఇస్తూ షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగలిగాం" అని నందిని రెడ్డి ఆనాటి షూటింగ్ విశేషాలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్
నందిని రెడ్డి పంచుకున్న ఈ ఎక్స్‌క్లూజివ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, షూటింగ్‌ను పూర్తి చేసిన నందిని రెడ్డి వృత్తిపరమైన నిబద్ధతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'మా ఇంటి బంగారం' విజయం వెనుక ఉన్న ఈ 'సీక్రెట్' ఇప్పుడు అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.




