Alias Rukmini: ‘అలియాస్ రుక్మిణి’గా వస్తున్న నితిన్.. నాని వాయిస్ ఓవర్‌తో అదిరిపోయిన గ్లింప్స్!

Alias Rukmini: నేచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 5:01 PM IST
Alias Rukmini
X

Alias Rukmini: ‘అలియాస్ రుక్మిణి’గా వస్తున్న నితిన్.. నాని వాయిస్ ఓవర్‌తో అదిరిపోయిన గ్లింప్స్!

Alias Rukmini: కథానాయకుడిగా వరుస విజయాలు సాధిస్తూనే, మరోవైపు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఆయన సమర్పణలో యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఒక ఆసక్తికరమైన చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు ‘అలియాస్ రుక్మిణి’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

యువ దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథాంశం ఎంతో కొత్తగా ఉండబోతోందని విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోకు నాని అందించిన వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్లింప్స్ ప్రారంభంలో నితిన్ ఇంజినీరింగ్ పుస్తకాల మధ్య నిద్రపోతూ కనిపించగా, అతని ముందు ‘గరం గోపాల్’, ‘ఆమెకు ఆమెంటే ఇష్టం’, ‘వత్రం వెంకన్న’ వంటి వినూత్న శీర్షికలు ఉన్న పుస్తకాలు కనిపిస్తాయి. వీటి రచయితగా ‘రుక్మిణి’ అనే పేరును నాని తన వాయిస్ ఓవర్‌లో ప్రస్తావిస్తారు.

చివర్లో నితిన్ “ఆమె నా భార్య” అని చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్ ముగియడం సినిమాపై ఉత్కంఠను పెంచేసింది. ‘అలియాస్ రుక్మిణి’ వెనుక ఉన్న అసలు కథేంటి? రుక్మిణి పాత్ర ప్రాధాన్యత ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

నితిన్ కెరీర్‌లో రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్‌తో కూడిన మరో కొత్త తరహా కాన్సెప్ట్ చిత్రంగా ఇది నిలవనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాని నిర్మాణంలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో 'అలియాస్ రుక్మిణి'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటులు, విడుదల తేదీ వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story