Kapaali: నారా రోహిత్ ‘కపాలి’ ఫస్ట్ లుక్ విడుదల…

Kapaali: టాలీవుడ్ విలక్షణ నటుడు నారా రోహిత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Srinivas Rao
Published on: 25 July 2026 11:30 AM IST
Kapaali
X

Kapaali: నారా రోహిత్ ‘కపాలి’ ఫస్ట్ లుక్ విడుదల…

Kapaali: టాలీవుడ్ విలక్షణ నటుడు నారా రోహిత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆయన ఒకటి కంటే ఎక్కువ చిత్రాలలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 - ఏకే 47’ చిత్రంలో నారా రోహిత్ కీలకమైన పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

భయానక పోస్టర్‌తో ‘కపాలి’ టైటిల్ అనౌన్స్‌మెంట్

శనివారం నారా రోహిత్ పుట్టినరోజు (జూలై 25) సందర్భంగా, ఆయన నటిస్తున్న మరో కొత్త చిత్రం టైటిల్ , కపాలి’ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ గన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

సప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మించగా.. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ టాలీవుడ్‌ రీఎంట్రీ ఇస్తుండగా, నారా రోహిత్ సరసన ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఫస్ట్ లుక్

"కపాలం ధరించినవాడు" అనే అర్థం వచ్చే కపాలి’ ‘టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. పోస్టర్‌లో నారా రోహిత్ తీవ్రమైన, గంభీరమైన చూపులతో పైకి చూస్తూ కనిపించగా.. ఆయన తలపై చెట్ల కొమ్మలు కిరీటంలా రావడం మిస్టికల్ కనెక్షన్‌ను సూచిస్తోంది. వెనుకభాగంలో ప్రాచీన రహస్య సంకేతాలు, భయానక ఎర్రని కళ్లతో ఉన్న ఒక స్త్రీ రూపం, పోలీస్ వాహనాలు, రిచువల్ సర్కిల్ వంటి అంశాలు ఈ సినిమాపై తీవ్రమైన పారానార్మల్ క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story