The Paradise: అంచనాలు పెంచేలా 'ది ప్యా‌రడైజ్' టీజర్.. మాస్ లుక్‌లో అదరగొట్టిన నాచురల్ స్టార్..

Nani The Paradise Movie Teaser: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ది ప్యా‌రడైజ్' మూవీ నుంచి టీజర్ విడుదలైంది. ఈ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Ravi
By Ravi
Published on: 6 Aug 2026 7:18 PM IST
The Paradise
X

The Paradise: అంచనాలు పెంచేలా 'ది ప్యా‌రడైజ్' టీజర్.. మాస్ లుక్‌లో అదరగొట్టిన నాచురల్ స్టార్..

Nani The Paradise Movie Teaser: టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యా‌రడైజ్' (The Paradise) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, సంచలన చార్ట్‌బస్టర్ సాంగ్ 'ఆయా షేర్' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింత తారాస్థాయికి చేర్చింది. మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో నాని కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.

ఈ టీజర్‌లో నాని చెప్పిన "ఈ జాగా మనదే, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి" అంటూ సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. అలాగే మరోవైపు ప్రముఖ నటుడు మోహన్ బాబు చెప్పిన "మేరీ ప్యారీ ప్యా‌రడైజ్ వాసియో" అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో కథానాయికగా కయాదు లోహర్ నటిస్తుండగా, టీజర్‌లో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే మొత్తం టీజర్ అంతా పూర్తి స్థాయి వయిలెన్స్, రగ్డ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో నిండిపోయింది.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన మరో అంశం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం అని చెప్పవచ్చు. టీజర్ అంతటా అనిరుధ్ అందించిన మాస్ బీజీఎం అరుపులు పుట్టిస్తూ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మాస్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story