Nani The Paradise Movie: సీఎం రేవంత్‌రెడ్డికి హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్..దయచేసి అనుమతి ఇవ్వండంటూ!

Nani The Paradise Movie: 'ది ప్యారడైజ్' సినిమాను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి నాని 'X' వేదికగా విజ్ఞప్తి చేశారు.

Gagan kumar
Published on: 23 Sept 2026 10:20 AM IST
Nani The Paradise Movie
X

Nani The Paradise Movie: సీఎం రేవంత్‌రెడ్డికి హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్..దయచేసి అనుమతి ఇవ్వండంటూ!

CM Revanth Reddy: నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను సాధారణ ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూసేందుకు నాని ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు.

సినిమా హబ్‌గా పేరొందిన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని థియేటర్‌లో ‘ప్యారడైజ్’ సినిమాను ప్రేక్షకులు, అభిమానుల మధ్య చూసేందుకు అనుమతివ్వాలని కోరుతూ నాని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ప్రీమియర్ షో, ఫస్ట్ షోలను అభిమానుల కోలాహలం మధ్య చూడాలని తాను ఎంతగానో ఆశిస్తున్నట్లు తెలిపారు.

తాను నటించిన సినిమాను కేవలం తెరపై చూసి సరిపెట్టుకోవడం కాకుండా, థియేటర్‌లో ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్‌ను లైవ్‌లో గమనించడంలోనే అసలుసిసలు ఆనందం ఉంటుందని నాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. భారీగా తరలివచ్చే అభిమానుల తాకిడి, జనసంచారాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా ప్రమాణాలు, నిబంధనలను పక్కాగా పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సానుకూలంగా పరిశీలిస్తారని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసేందుకు తగిన అనుమతులు ఇస్తారని నాని ధీమా వ్యక్తం చేశారు. మరి నాని చేసిన ఈ రిక్వెస్ట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.