The Paradise: దసరా మూవీ రికార్డులు బ్రేక్..'ది ప్యారడైజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ?
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ది ప్యారడైజ్.
The Paradise
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి భారీ స్పందన లభిస్తోంది. సీబీఎఫ్సీ నుంచి 'ఏ' సర్టిఫికేట్ పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.
మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్
ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల సమాచారం ది ప్యారడైజ్ సినిమా మొదటి రోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు రూ.31.04 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక గ్రాస్ వసూళ్లు రూ.36.63 కోట్లకు పైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వేలాది షోలతో ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి సుమారు 46.8 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీ లభించింది. లేట్-నైట్ షోల కలెక్షన్లు కూడా కలిపితే ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు
ఈ భారీ ఓపెనింగ్‌తో నాని తన గత సినిమాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశారు. నాని గత చిత్రాలైన హిట్: ది థర్డ్ కేస్ మొదటి రోజు రూ.21 కోట్ల నెట్ రాబట్టగా, దసరా సినిమా రూ.23.20 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అలాగే సరిపోదా శనివారం రూ.9 కోట్లు, హాయ్ నాన్న రూ.4.90 కోట్ల ఓపెనింగ్స్‌ను మాత్రమే రాబట్టాయి. ఇప్పుడు ది ప్యారడైజ్ మొదటి రోజే రూ.31 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్లోనే ఆల్-టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
భాషల వారీగా వసూళ్ల వివరాలు
ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుంచి అత్యధికంగా రూ.27.77 కోట్లు రాగా, హిందీ వెర్షన్లో రూ.2.14 కోట్లు, తమిళంలో రూ.1.13 కోట్లు వసూలయ్యాయి. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్యారడైజ్ అనే కల్పిత ప్రదేశంలోని సవారి తెగ పోరాటాన్ని కళ్లకు కట్టారు. నానితో పాటు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




