Nayanthara: నయనతార మెయింటెనెన్స్‌ రోజుకు ఎన్ని లక్షలో తెలుసా..?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార విలాసవంతమైన జీవనశైలి కోసం రోజుకు ఎంత ఖర్చవుతుంది?

Naresh.k
Published on: 7 May 2026 9:44 AM IST
Nayanthara
X

Nayanthara: నయనతార మెయింటెనెన్స్‌ రోజుకు ఎన్ని లక్షలో తెలుసా..? 

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా ఏకచ్ఛత్రాధిపత్యం చలాయిస్తున్న నయనతార విలాసవంతమైన జీవనశైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రైవేట్ జెట్ నుంచి కోట్లాది రూపాయల విల్లా వరకు.. ఆమె లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. అయితే, తాజాగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్.. నయన్ మెయింటెనెన్స్ కోసం రోజుకు ఎంత ఖర్చవుతుందో చెప్పకనే చెప్పేసిన ఒక ఫైనాన్షియల్ లెక్క ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వెళ్తున్న నయనతార, 'జవాన్'తో పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటారు. కేవలం నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్‌గా కూడా రాణిస్తున్న ఆమె ఖర్చుల గురించి విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. తన ఫ్యామిలీని ఎంతో కంఫర్టబుల్‌గా, హ్యాపీగా చూసుకోవాలంటే కనీసం 350 కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉండాలని తన మనసులో మాట బయటపెట్టారు.

350 కోట్ల రూపాయల డిపాజిట్ ఎందుకు? అని అడిగితే విఘ్నేష్ పక్కాగా లెక్కలు వివరించారు. 350 కోట్లను డిపాజిట్ చేస్తే ఏడాదికి సుమారు 21 నుంచి 24 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. దీనిని నెలవారీగా విభజిస్తే దాదాపు రెండు కోట్ల రూపాయలు చేతికి వస్తాయి. అంటే రోజుకు సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వస్తేనే తన కుటుంబం ఎలాంటి ఇబ్బంది లేకుండా, అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన డీకోడ్ చేశారు.

విఘ్నేష్ చెప్పిన లెక్కలను బట్టి నెటిజన్లు ఇప్పుడు నయనతార లైఫ్ స్టైల్ ఖర్చులపై అంచనాలు వేస్తున్నారు. షూటింగ్ లేని సమయంలో నయన్ తన మేకప్, స్టైలిస్ట్, బౌన్సర్స్, ప్రైవేట్ జెట్ మెయింటెనెన్స్, డైలీ లైఫ్ స్టైల్ కోసం రోజుకు కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం నటనతోనే కాకుండా.. రౌడీ పిక్చర్స్ ద్వారా నిర్మాణ రంగంలో, స్కిన్ కేర్ బ్రాండ్స్ ద్వారా వ్యాపార రంగంలో, వివిధ స్టార్టప్‌లలో పెట్టుబడుల ద్వారా నయన్ భారీగా సంపాదిస్తున్నారు. అందుకే విఘ్నేష్ కూడా ఇప్పుడు తన ఫోకస్ అంతా మనీ మేకింగ్ మీదే ఉందని, పెద్ద పెద్ద బిజినెస్ మేన్ల సలహాలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story