OTT movies: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే..సందడి చేయనున్న సూపర్ హిట్ సినిమాలు

OTT movies: శ్రీవిష్ణు నటించిన 'మృత్యుంజయ్', ఆమిర్ ఖాన్ నిర్మించిన 'హ్యాపీ పటేల్',వంటి క్రేజీ రిలీజెస్ ఏప్రిల్ 3 నాటికి స్ట్రీమింగ్ కానున్నాయి.

Naresh.k
Published on: 2 April 2026 3:17 PM IST
OTT movies
X

OTT movies: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే..సందడి చేయనున్న సూపర్ హిట్ సినిమాలు 

OTT Releases This Week వేసవి సెలవుల వేళ ఇంటివద్దే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ అదిరిపోయే గిఫ్ట్ ఇస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వారం రిలీజ్ కానున్న ఆ క్రేజీ కంటెంట్ ఏంటో చూద్దాం.

మృత్యుంజయ్

వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ వాచ్.

సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని

సీనియర్ నటుడు శివాజీ, హీరోయిన్ లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ మూవీ ఇది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. లయ సెకండ్ ఇన్నింగ్స్ , శివాజీ కామెడీ టైమింగ్ కోసం చూసే వారికి ఇది మంచి ఆప్షన్.

వధ్ 2

సంజయ్ మిశ్రా, నీనా గుప్తా వంటి దిగ్గజ నటులు నటించిన 'వధ్' మొదటి పార్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్ 'వధ్ 2' తో మరింత ఉత్కంఠను పంచడానికి సిద్ధమయ్యారు. జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏప్రిల్ 3 నుంచి అందుబాటులోకి వస్తుంది.

హ్యాపీ పటేల్ - ఖతర్నాక్ జాసూస్

మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ కామెడీ ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం హిందీ భాషలో అందుబాటులో ఉంది. వీకెండ్‌లో సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మూవీ.

మామ్లా లీగల్ హై - సీజన్ 2

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన పాపులర్ లీగల్ కామెడీ సిరీస్ 'మామ్లా లీగల్ హై' ఇప్పుడు సెకండ్ సీజన్‌తో రాబోతోంది. రవి కిషన్ లాయర్ పాత్రలో చేసే హంగామా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. రాహుల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఏప్రిల్ 3న విడుదల కానుంది.

Naresh.k

Naresh.k

Next Story