కార్గిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ట్రైలర్!

Operation Safed Sagar: 1999 కార్గిల్ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక మిలిటరీ డ్రామా సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar).

Srinivas Rao
Published on: 21 July 2026 2:53 PM IST
Operation Safed Sagar
X

కార్గిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ట్రైలర్!

Operation Safed Sagar: 1999 కార్గిల్ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక మిలిటరీ డ్రామా సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar). జిమ్మీ షెర్గిల్, సిద్ధార్థ్, బరుణ్ సోబ్తి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సిరీస్ అధికారిక ట్రైలర్‌ను సోమవారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేశారు. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 7న స్ట్రీమింగ్ కానుంది.

కథా నేపథ్యం … ప్రత్యేకతలు

ఉన్నత ప్రాంతాల నుంచి దురాక్రమణకు పాల్పడిన ఉగ్రవాద శక్తులను ఎదుర్కోవడంలో భారత సైన్యానికి తోడుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగిన చారిత్రాత్మక ఘట్టమే 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. ప్రపంచంలోనే అత్యున్నత ప్రాంతంలో జరిగిన ఈ వైమానిక ఆపరేషన్ కార్గిల్ యుద్ధ గమనాన్ని ఎలా మార్చిందనేది ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.

ఈ కథలో భాగంగా 'గోల్డెన్ యారోస్' స్క్వాడ్రన్‌కు చెందిన యంగ్ ఫైటర్ పైలట్లు పడిన శ్రమ, ఎదుర్కొన్న సవాళ్లను డైరెక్టర్ ఓని సేన్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. వింగ్ కమాండర్ బి.ఎస్. ధనోవా 'టోనీ' (జిమ్మీ షెర్గిల్) నేతృత్వంలో, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా (సిద్ధార్థ్), యువ ఆఫీసర్లుగా అభయ్ వర్మ, మిహిర్ అహుజా, తారుక్ రైనా తదితరులు ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం చేసిన సాహసాలను ఇందులో చూపించనున్నారు.

భారీ తారాగణం… సాంకేతిక నిపుణులు

సానియ్ రౌత్రే, సరితా పాటిల్ (మ్యాచ్‌బాక్స్ షాట్స్), మెహబూబ్ పాల్ సింగ్ బ్రార్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. జిమ్మీ షెర్గిల్, సిద్ధార్థ్, బరుణ్ సోబ్తిలతో పాటు దియా మీర్జా, ప్రాజెక్టా కోలి, ఆదిల్ హుస్సేన్, వినయ్ పాఠక్, మహేష్ మంజ్రేకర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిజిత్ సింగ్ పర్మార్, కుశాల్ శ్రీవాత్సవ ఈ సిరీస్‌ను సృష్టించగా, ఓని సేన్ దర్శకత్వం వహించారు. కార్గిల్ యుద్ధంలో వైమానిక దళం పాత్రను వెండితెరపైకి తీసుకురావడం తమ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ పేర్కొన్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story