Resident Evil: భయపెట్టేందుకు వస్తోన్న ‘రెసిడెంట్ ఈవిల్’.. ట్రైలర్ రిలీజ్
Resident Evil: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా వస్తున్న సరికొత్త చిత్రం ‘రెసిడెంట్ ఈవిల్’.
Resident Evil: భయపెట్టేందుకు వస్తోన్న ‘రెసిడెంట్ ఈవిల్’.. ట్రైలర్ రిలీజ్
Resident Evil: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా వస్తున్న సరికొత్త చిత్రం ‘రెసిడెంట్ ఈవిల్’. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫిల్మ్ సిరీస్కు సంబంధించి వస్తున్న ఈ రీబూట్ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.
జాచ్ క్రెగర్ దర్శకత్వంలో సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్!
‘బార్బేరియన్’ (2022), ‘వెపన్స్’ (2025) వంటి ప్రశంసలు పొందిన చిత్రాల దర్శకుడు జాచ్ క్రెగర్ ఈ రీబూట్కు దర్శకత్వం వహిస్తున్నారు. జాచ్ క్రెగర్తో కలిసి షే హాటెన్ ఈ చిత్రానికి కథను అందించారు. ప్రసిద్ధ ఫస్ట్-పర్సన్ షూటర్ వీడియో గేమ్ ఆధారంగా, కల్పిత అమెరికన్ నగరమైన రాకూన్ సిటీ నేపథ్యంలో జోంబీలతో కూడిన భయానక వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
లీడ్ యాక్టర్స్ … టెక్నిక్ టీమ్ వివరాలు
దర్శకుడు జాచ్ క్రెగర్తో గతంలో ‘వెపన్స్’ చిత్రంలో పనిచేసిన ఆస్టిన్ అబ్రమ్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఒక మెడికల్ కొరియర్ 'బ్రియాన్' పాత్రలో కనిపించనున్నారు. రాకూన్ సిటీకి ఒక పార్శిల్ అందజేయడానికి వెళ్లే క్రమంలో, జోంబీలతో నిండిన నగరంలో ఒక రాత్రి ప్రాణాలతో బయటపడటానికి ఆయన చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో జాచ్ చెర్రీ, కాలి రీస్, పాల్ వాల్టర్ హౌసర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దర్శకుడు జాచ్ క్రెగర్తో పాటు రాబర్ట్ కుల్జెర్, రాయ్ లీ, మిరి యూన్, కార్టర్ స్వాన్, అసాద్ ఖిజిల్బాష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




