Okkadu Charminar Set Secret: ఒక్కడులో చార్మినార్ సెట్..ఎలా వేశారో తెలిస్తే షాకవుతారు?
మహేష్‌బాబును సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఒక్కడు. ఒక్కడు సినిమా పేరు చెప్పగానే చార్మినార్ సెట్ గుర్తుకు వస్తుంది. ఈ సెట్ ఆరోజుల్లో ఓ సన్సెషన్ అనే చెప్పాలి.
Okkadu Charminar Set Secret: మహేష్‌బాబును సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఒక్కడు. ఒక్కడు సినిమా పేరు చెప్పగానే చార్మినార్ సెట్ గుర్తుకు వస్తుంది. ఈ సెట్ ఆరోజుల్లో ఓ సన్సెషన్ అనే చెప్పాలి. ఈ సెట్‌కి సంబంధించిన అంశాలను దర్శకుడు గుణశేఖర్ బయటపెట్టారు. 2003లో అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక మాయాజాలాన్ని ఉపయోగించి సెట్స్ నిర్మించారు. మరి ఆ సెట్స్ రూపకల్పన ఎలా జరిగిందో తెలుసుకుందామా.
తెలుగు సినిమా చరిత్రను 'ఒక్కడు'కు ముందు, 'ఒక్కడు'కు తర్వాత అని విభజించవచ్చు. ముఖ్యంగా ఆ సినిమాలో కనిపించే చార్మినార్ సెట్ అప్పట్లో ఒక సంచలనం. అయితే, ఆ చార్మినార్ మొత్తం సెట్ కాదని, అందులో సగం కంటే ఎక్కువ భాగం కంప్యూటర్ గ్రాఫిక్స్ అని దర్శకుడు గుణశేఖర్ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
గ్రాఫిక్స్ అని తెలియనివ్వని సృజనాత్మకత
సాధారణ చార్మినార్ ఎత్తు 175 అడుగులు. కానీ షూటింగ్ కోసం వెసిన సెట్ కేవలం 75 అడుగులు మాత్రమే. అంటే మీనార్లు మాత్రమే సెట్‌గా వేశారు. మిగిలిన 100 అడుగుల భాగాన్ని, దాని చుట్టూ ఉండే పాతబస్తీ గల్లీలను అప్పట్లోనే అత్యంత ఖరీదైన సీజీఐతో నిర్మించారు. థియేటర్లో చూస్తున్నప్పుడు అది గ్రాఫిక్స్ అని ఒక్క ప్రేక్షకుడు కూడా పసిగట్టలేకపోవడం గుణశేఖర్ సాధించిన అసలు విజయంగా చెబుతారు.
షూటింగ్ కష్టాలు - రూఫ్‌టాప్ ఐడియా
పాతబస్తీలో షూటింగ్ చేయాలంటే ఎప్పుడైనా కష్టమే. ఇక్కడ షూటింగ్ అంటే అంత ఈజీగా అనుమతులు రావు. పైగా చార్మినార్ వద్ద షూటింగ్ చేసేందుకు అనుమతులు లేవు. దీంతో సెట్ వేయాలని నిర్ణయించుకున్నది యూనిట్. సెట్ నిర్మాణమే ఓ పెద్ద ప్లస్ పాయింట్. చార్మినార్ కిందనుంచి చూస్తే ఒకలా, ఇళ్లపై నుంచి చూస్తే వారికి ఒకలా కనిపిస్తుంది. రూఫ్‌టాప్ నుంచి చూసేవారికి మీనార్ల అందం కనిపిస్తుంది. ఈ ఆలోచనతోనే సినిమా సెట్ రూపొందించారు. మనకు సినిమాలో ఎక్కువ భాగం మీనార్లు మాత్రమే కనిపిస్తుంటాయి. రూఫ్‌టాప్ ఇళ్లే దర్శనం ఇస్తాయి. ఇక్కడే మహేష్ బాబు పరుగులు, గల్లీల్లో యాక్షన్ సీన్స్ సన్నివేశాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి.
మహేష్ బాబు 'సూపర్ స్టార్' ప్రస్థానం
ఈ సినిమా విజయంతో మహేష్ బాబు రేంజ్ మారిపోయింది. కేవలం కథపై ఉన్న నమ్మకంతోనే చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు తనతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని గుణశేఖర్ గర్వంగా చెబుతారు. విజయం ఎప్పుడు వస్తుందో, అపజయం ఎందుకు పలకరిస్తుందో ఎవరూ ఊహించలేరని, కానీ పడిన శ్రమ మాత్రం ఎప్పుడూ వృథా పోదని ఆయన విశ్లేషించారు. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు అవుతున్నా... ఇప్పటికీ ఒక్కడు చార్మినార్ సెట్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.




