Padayappa: కమల్‌హాసన్ ఎడిటింగ్...మొదటిసారి అమితాబ్ ఇలా...ఇండస్ట్రీ షేక్ చేసిన రజనీ సినిమా
దక్షిణ భారత సినీ చరిత్రలో ‘బాషా’ ఒక ఎత్తు అయితే, రజనీకాంత్ మేనరిజం, రమ్యకృష్ణ గంభీరమైన నటన కలగలిసిన ‘నరసింహ’ తమిళంలో పడయప్ప మరో ఎత్తు.
Padayappa: దక్షిణ భారత సినీ చరిత్రలో ‘బాషా’ ఒక ఎత్తు అయితే, రజనీకాంత్ మేనరిజం, రమ్యకృష్ణ గంభీరమైన నటన కలగలిసిన ‘నరసింహ’ తమిళంలో పడయప్ప మరో ఎత్తు. కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, అప్పట్లోనే 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సినిమా వెనుక ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన వాస్తవాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రామాయణ స్ఫూర్తి.. 15 మంది హీరోయిన్ల తిరస్కరణ
రజనీకాంత్ ఇమేజ్‌కి తగ్గ కథ తయారు చేయాలంటే అప్పట్లో చాలా పెద్ద సాహసం చేయాల్సి వచ్చేది. పెద్ద పెద్ద రచయితలంతా కూర్చొని కథను సిద్దం చేసేవారు. రజనీకాంత్‌కు ఎన్నో హిట్స్ ఇచ్చిన కెఎస్ రవికుమార్‌కు కూడా ఇది పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలోనే 'పొన్నియిన్ సెల్వన్' నవలలోని కొన్ని అంశాలను తీసుకుని పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఇక ఈసినిమాలోని ఓ సీన్‌ను రామాయణం నుంచి స్పూర్తిగా తీసుకున్నారు. నీలాంబరి ఇంటికి వెళ్లిన రజనీకాంత్ భుజంపై ఉన్న పైపంచను విసిరి, ఊయల కుర్చీని లాగి కూర్చునే సీన్‌ను రామాయణం స్పూర్తిగా తీసుకున్నారు. హనుమంతుడు తన తోకతో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చున్న ఘట్టం నుంచి తీసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో నీలాంబరి పాత్ర కోసం ఆరోజుల్లో దాదాపు 15 మంది అగ్ర హీరోయిన్లను సంప్రదించారు మేకర్స్. కానీ, రజనీని ఎదిరించే పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఎక్కడ ఫైర్ అవుతారోనని భయపడి వెనక్కి తగ్గారు. రమ్యకృష్ణ ఆ సవాలును స్వీకరించి నీలాంబరిగా నటించింది. ఆ పాత్ర తనకోసమే పుట్టిందా అనే విధంగా నటించి మెప్పించారు.
కమల్ హాసన్ ఎడిటింగ్.. అమితాబ్ ప్రత్యేక ప్రయాణం
రజనీకాంత్‌కు అనుంగ మిత్రుడు కమల్ హాసన్. ఈ సినిమా పూర్తయ్యి ఎడిటింగ్ చేశాక దాదాపు మూడున్నర గంటలపాటు సినిమా రన్ టైమ్ వచ్చింది. అయితే, రజనీకాంత్ ఈ సినిమాను కమల్‌హాసన్‌కు చూపించారు. కథలోని వేగాన్ని మరింతగా పెంచేందుకు కొన్ని కీలమైన ఎడిటింగ్ మార్పులు సూచించారు. కమల్‌హాసన్ సలహాతో మార్పులు చేసి నిడివి తగ్గించారు. ఇలా తగ్గించిన తరువాత సినిమా మరింత పవర్‌ఫుల్‌గా తయారైంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమా క్రేజ్ చూసి, విడుదలైన రోజే చెన్నైకి వచ్చి సినిమా చూశారు. ఒక తమిళ సినిమా కోసం అమితాబ్ ప్రత్యేకంగా మరో నగరానికి వెళ్లడం అదే మొదటిసారి కావడం విశేషం. ఇలా రజనీకాంత్ సినిమా కోసం కమల్‌హాసన్ ఎడిటింగ్ పనిచేయగా... అమితాబ్ ప్రత్యేకంగా ముంబై నుంచి చైన్నై వచ్చి మొదటిసారి తమిళ సినిమాను చూడడం విశేషం.
రికార్డుల సునామీ
ఆరోజుల్లో ఈ సినిమా కోసం రూ. 4 కోట్లు కేటాయించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళ వెర్షన్‌లోనే కాదు...ఇటు తెలుగు డబ్బింగ్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆరోజుల్లో ఈ సినిమా తెలుగునాట 7 కోట్ల రూపాయల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఓవర్సీస్‌లో 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రజనీకి అంతర్జాతీయ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమా ఐదు తమిళ స్టేట్ అవార్డులను కైవసం చేసుకుంది.
ఇక ఈసినిమా ఈ స్థాయి క్రేజ్ సంపాదించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగులు. రజనీకాంత్ మేనరిజం ఏ విధంగా ఆకట్టుకుందో నా దారి రహదారి అంటూ రజనీ చెప్పిన డైలాగులు నేటికీ పేలుతుంటాయి. ఈ సినిమా కేవలం 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడమే కాకుండా రజనీని ఒక లెజెండ్‌గా నిలబెట్టింది. ఒక మంచి సినిమా కోసం ఇద్దరు దిగ్గజ నటులు ఎలా సహకరించుకుంటారో చెప్పడానికి ‘నరసింహ’ ఓ నిదర్శనం.




