Pallaburusu: అచ్చమైన తెలంగాణ యాసలో ‘పల్లబురుసు’ ఫస్ట్ సింగిల్ ‘కొత్త సోకు’ విడుదల!
Pallaburusu: టైటిల్ పోస్టర్ , గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ‘పల్లబురుసు’ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా తొలి పాటను విడుదల చేశారు.
Pallaburusu: అచ్చమైన తెలంగాణ యాసలో ‘పల్లబురుసు’ ఫస్ట్ సింగిల్ ‘కొత్త సోకు’ విడుదల!
Pallaburusu: టైటిల్ పోస్టర్ , గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ‘పల్లబురుసు’ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా తొలి పాటను విడుదల చేశారు. ఇండస్ట్రీలో వస్తున్న సాధారణ సినిమాలకు భిన్నంగా, పూర్తిగా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల అమాయకత్వం, మట్టి వాసనలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని తొలి పాట అచ్చమైన తెలంగాణ మాండలికం, పల్లె పదాలతో శ్రోతలను ఇన్‌స్టంట్‌గా కట్టిపడేస్తోంది.
తెలంగాణ పల్లె జీవనాన్ని కళ్లకు కట్టే ‘కొత్త సోకు’ పాట
పవన్ సి హెచ్ సంగీతం అందించిన ‘కొత్త సోకు’ జానపద గీతాన్ని కుమార వాగ్దేవి తన అద్భుతమైన గొంతుతో ఎంతో ఉత్సాహంగా ఆలపించారు. ఈ పాటకు సురేష్ గంగుల అందించిన సాహిత్యం పూర్తిగా తెలంగాణ పల్లెటూరి నేటివిటీని ప్రతిబింబిస్తోంది. పాటలోని ప్రతీ పదం నైజాం ప్రాంతపు యాసను, అక్కడి గ్రామీణ సోకులను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించింది. పల్లెటూరి వాతావరణం, ఉత్సాహభరితమైన వేడుకలు, మనుషుల మధ్య జరిగే సరదా అల్లరి క్షణాలతో సాగే ఈ జానపద బాణీ శ్రోతలను ఊర్రూతలూగిస్తోంది.
తారాగణం … విడుదల తేదీ
ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుధాకర్ రెడ్డి తనదైన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ట్రెడిషనల్ పల్లె వాతావరణంలో ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కనిపించిన స్టైలిష్ లుక్ నవ్వులు పూయిస్తోంది. మరో కీలక పాత్రలో మురళీధర్ గౌడ్ నటిస్తున్నారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని నిర్మిస్తున్నారు. అచ్చమైన తెలంగాణ యాస, బాసలతో విభిన్నమైన వినోదాన్ని పంచేందుకు వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.




