Paradise: నాని 'ప్యారడైజ్' మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే.! ఎక్కడంటే.?

Paradise: నాని హీరోగా తెరకెక్కిన ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది.

Ravi
By Ravi
Published on: 25 Sept 2026 7:35 PM IST
Paradise
X

Paradise: నాని 'ప్యారడైజ్' మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే.! ఎక్కడంటే.?

Paradise: భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన చిత్రాలలో ప్యారడైజ్ ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే మొదటి రోజు రూ. 34 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం.

ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులకు భారీ డీల్ కుదిరినట్లు తెలిసిందే. సినిమా విడుదల కాకముందే డిజిటల్ మార్కెట్‌లో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడటం విశేషం. ఈ క్రమంలోనే ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ అలాగే కన్నడ భాషలకు సంబంధించిన అన్ని డిజిటల్ హక్కులను ఈ సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు మోహన్ బాబు శక్తివంతమైన విలన్ పాత్రను పోషించారు. అలాగే ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి హీరోకి తల్లి పాత్రలో కనిపించారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు.

అక్టోబర్ 22 తర్వాత ప్యారడైజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం మొత్తం థియేట్రికల్ రన్‌లో ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి. సినిమాకు నాని, మోహన్ బాబు నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.