OG: టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ 'ఓజీ'

OG: పవన్‌ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా 'దే కాల్ హిమ్ ఓజీ' (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద ఏ రీతిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Srinivas Rao
Published on: 21 July 2026 10:56 AM IST
OG
X

OG: టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ 'ఓజీ'

OG: పవన్‌ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా 'దే కాల్ హిమ్ ఓజీ' (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద ఏ రీతిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేట్రికల్ రన్ ముగిసి దాదాపు పది నెలలు కావస్తున్నా, ఈ సినిమా బుల్లితెర ప్రసార హక్కులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానెల్ ఈటీవీ దక్కించుకున్నట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది.

బుల్లితెరపైకి 'ఓజీ' ఎంట్రీ

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రోమోల ద్వారా 'ఓజీ' శాటిలైట్ హక్కులను ఆ ఛానెల్ సొంతం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఆగస్టు నెలలో రాబోయే ప్రత్యేక పండుగ రోజున ఈ సినిమాను టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో, ఓటీటీలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

అధికారికంగా సీక్వెల్ చర్చలు షురూ

మరోవైపు, ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే సన్నాహాలు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. కథను కొనసాగించడంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆసక్తి కనబరుచడంతో 'ఓజీ 2' ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్వయంగా పవన్ కళ్యాణ్ తన సొంత బేనర్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పై నిర్మించనున్నారు. ఇక ఈ సీక్వెల్‌కు కూడా ఎస్. థమన్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story