Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్.. భారీ వసూళ్లు సాధిస్తేనే హిట్!
Ustaad Bhagat Singh: ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.50 కోట్లు, ఆంధ్రాలో రూ.54 కోట్లు, సీడెడ్‌లో 1రూ.6 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినట్టుగా తెలిసింది.
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్.. భారీ వసూళ్లు సాధిస్తేనే హిట్!
Ustaad Bhagat Singh: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తర్వాత పవన్, హరీష్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
నైజాంలో రూ.50 కోట్లు:
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.50 కోట్లు, ఆంధ్రాలో రూ.54 కోట్లు, సీడెడ్‌లో 1రూ.6 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినట్టుగా తెలిసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 137 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్:
మైత్రీ మూవీ మేకర్స్ ఉస్తాద్ చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా తగ్గకుండా నిర్మించారు. సినిమా క్లీన్ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. కనీసం రూ.140 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.225 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు మంచి టాక్ తోడైతే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాంకేతిక హంగులు:
శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఉస్తాద్ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తుండటం విశేషం. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇండస్ట్రీ ఇన్ సైడ్ రిపోర్ట్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. దాంతో 'ఉస్తాద్' బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




