మైండ్ బ్లాక్ చేస్తున్న ‘స్పైడర్-మ్యాన్.. బ్రాండ్ న్యూ డే’ అఫీషియల్ ట్రైలర్!
Spider-Man 4: టామ్ హాలండ్) హీరోగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్సల్ నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది.
మైండ్ బ్లాక్ చేస్తున్న ‘స్పైడర్-మ్యాన్.. బ్రాండ్ న్యూ డే’ అఫీషియల్ ట్రైలర్!
Spider-Man 4: టామ్ హాలండ్) హీరోగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్సల్ నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటివరకు వచ్చిన స్పైడర్-మ్యాన్ సిరీస్‌ల కంటే అత్యంత డార్క్, యాక్షన్-ప్యాక్డ్ మరియు ఎమోషనల్ రైడ్‌గా ఈ సినిమా ఉండబోతోందని తాజా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. గతం మర్చిపోయిన ప్రపంచంలో పీటర్ పార్కర్ పడుతున్న ఒంటరి పోరాటం, కొత్త విలన్లు, ఊహించని కొల్లాబరేషన్లతో ట్రైలర్ మైండ్ బ్లాక్ చేస్తోంది.
మ్యుటేటింగ్ డీఎన్‌ఏ.. బ్రూస్ బ్యానర్ సాయం కోరిన పీటర్ పార్కర్!
ట్రైలర్ ప్రారంభంలోనే స్పైడర్-మ్యాన్ తన కంట్రోల్ తప్పుతున్నట్లు చూపించారు. ప్రమాదకరమైన విలన్ ‘స్కార్పియన్’ దాడి చేసినప్పుడు పీటర్ పార్కర్ తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. ఎంతలా అంటే, ఫైట్ చేస్తున్న సమయంలో కోపంతో ఒక పోలీస్ కారును సైతం పూర్తిగా ధ్వంసం చేస్తాడు. ప్రపంచం మొత్తం తనే స్పైడర్-మ్యాన్ అనే విషయాన్ని మర్చిపోవడంతో తీవ్రమైన ఐడెంటిటీ క్రైసిస్ ఎదుర్కొంటున్న పీటర్.. తన శరీరంలో వేగంగా మారుతున్న డీఎన్‌ఏ ను నియంత్రించుకోవడానికి బ్రూస్ బ్యానర్ (హల్క్) సాయం కోరతాడు. కానీ, ఆ ప్రయత్నం కూడా విఫలమవ్వడం కథలో పెద్ద ట్విస్ట్‌గా మారనుంది.
న్యూయార్క్‌ను వణికించనున్న సాడీ సింక్.. ఎమ్‌జే కోసం తపన!
ఒకవైపు తన శక్తులపై కంట్రోల్ తప్పుతుంటే.. మరోవైపు హాలీవుడ్ పాపులర్ నటి సాడీ సింక్ పోషిస్తున్న నెగెటివ్ క్యారెక్టర్ న్యూయార్క్ సిటీపై దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తుంది. దీనికి తోడు, తన ప్రాణసఖి ఎమ్‌జే ను దక్కించుకోలేకపోతున్నాననే బాధ, మానసిక వేదన పీటర్ సూపర్‌పవర్స్‌ను మరింత బలహీనపరుస్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు.
రంగంలోకి ‘పనిషర్’.. ది హ్యాండ్ నింజాల ఎంట్రీ!
ఈ సినిమాలో ‘ది పనిషర్’ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని ట్రైలర్ హింట్ ఇచ్చింది. జాన్ బెర్న్తల్ ఈ రోల్‌లో పీటర్ పార్కర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వీటితో పాటు, మార్వెల్ కామిక్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ప్రమాదకరమైన ‘ది హ్యాండ్’ నింజా వారియర్స్ ఎంట్రీని కూడా మేకర్స్ ఇందులో టీజ్ చేశారు.
టాప్ టెక్నీషియన్స్ & భారీ స్టార్ కాస్టింగ్
'షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్ మెక్‌కెన్నా, ఎరిక్ సోమర్స్ స్క్రిప్ట్ అందించగా.. మార్వెల్ బాస్ కెవిన్ ఫీజ్, అమీ పాస్కల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
క్యాస్టింగ్ విషయానికొస్తే, ఎమ్‌జేగా జెండాయా, నెడ్‌గా జాకబ్ బాటలన్ మళ్లీ అలరించనున్నారు. అలాగే బ్రూస్ బ్యానర్‌గా మార్క్ రుఫాలో, స్కార్పియన్‌గా మైఖేల్ మాండో, టోంబ్ స్టోన్‌గా మార్విన్ జోన్స్ మరియు ట్రామెల్ టిల్మన్, లిజా కోలన్-జయాస్, ఇమాన్ ఎస్ఫాండి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొలంబియా పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా అందిస్తున్న ఈ యాక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




