Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన పోస్ట్.. హనీ ట్రాప్, తాంత్రికుడు అంటూ!
Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన సంచలన పోస్టులు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన పోస్ట్.. హనీ ట్రాప్, తాంత్రికుడు అంటూ!
Poonam Kaur: సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. తన సోషల్ మీడియా పోస్టులతో నిత్యం వార్తల్లో నిలిచే నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్‌లో కలకలం రేపారు. ఎవరి పేరూ నేరుగా చెప్పకుండా ఆమె వదిలిన విమర్శల బాణాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ తనదైన శైలిలో క్రిప్టిక్ పోస్టులు పెట్టే పూనమ్ కౌర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏమాత్రం ఆదర్శం లేని, 100 శాతం పబ్లిసిటీ చేసుకునే ఈ డైరెక్టర్ బారి నుంచి నటీనటులను, నిర్మాతలను దేవుడే కాపాడాలి అంటూ ఆమె ఘాటుగా స్పందించారు.
అంతేకాకుండా, హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే ఇతను తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ తాంత్రికుడు, నకిలీ గురువు నుంచి అమాయకులను ఆ దేవుడే కాపాడాలి అంటూ తీవ్రమైన పదజాలాన్ని వాడారు. ఆ వెంటనే మరో పోస్ట్ పెడుతూ.. AK అనేది మరో నటుడి విషయంలో ‘అజ్ఞాతవాసి’ లాంటిది.. అంతే"* అంటూ మరో బాంబు పేల్చారు. పూనమ్ కౌర్ ఎవరి పేర్లూ బయటపెట్టకపోయినప్పటికీ.. ఆమె వాడిన పదాలను బట్టి నెటిజన్లు ఇట్టే కనెక్ట్ అయిపోయాయి.
ఇదంతా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గురించేనని గట్టిగా చర్చిస్తున్నారు. పూనమ్ తన పోస్టులో 'ఆదర్శం' అనే పదాన్ని వాడటం... త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను గుర్తుచేస్తోంది. అలాగే 'AK' , గురు, త్రివిక్రమ్ కెరీర్‌లోని వివాదాస్పద సినిమా ‘అజ్ఞాతవాసి’ పేర్లను పరోక్షంగా ప్రస్తావించడంతో.. ఇది వంద శాతం ఆ సినిమా గురించేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం: AK - 47’ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే చాలాసార్లు మార్పులు జరిగాయి. ముందుగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీని, ఆ తర్వాత అక్టోబర్ 9కి పోస్ట్‌పోన్ చేశారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఆ రోజు కూడా సినిమా రావడం లేదని నిర్మాత నాగ వంశీ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ వస్తుందని చెబుతున్న వేళ.. పూనమ్ కౌర్ చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరింత చర్చకు దారితీశాయి.
గతంలోనూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన ఈ కామెంట్స్ టాలీవుడ్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.




