Prabhas: అభిమాని కోసం సినిమా ప్రమోషన్ చేసిన ప్రభాస్..!

Prabhas: సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న 'రోమాంచకం' చిత్ర బృందానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలిపారు.

Gagan kumar
Published on: 2 Sept 2026 9:13 AM IST
Prabhas
X

Prabhas: అభిమాని కోసం సినిమా ప్రమోషన్ చేసిన ప్రభాస్..!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా యువ నటుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన 'రోమాంచకం' చిత్ర బృందానికి తన శైలిలో అదిరిపోయే మద్దతును అందించారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిత్ర విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా హీరో సుమంత్ ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా సుమంత్ ప్రభాస్ చొక్కా (షర్ట్) పై ఆటోగ్రాఫ్ చేస్తూ బెస్ట్ విషెస్ తెలిపారు. ‘‘ఆల్ ది బెస్ట్.. ఇరగదీసేయ్.. 'రోమాంచకం' పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి, చివరకు మా ‘స్పిరిట్’ మూవీ కలెక్షన్లను కూడా దాటేయాలి’’ అని ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభాస్ అన్న ఈ మాటలకు అక్కడ నవ్వులు వికసించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ వంగా సమర్పిస్తున్న చిత్రం కావడంతో 'రోమాంచకం' మూవీకి ప్రభాస్ తనవంతు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను షేర్ చేస్తూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన డార్లింగ్, ఇప్పుడు నేరుగా హీరోను కలిసి ఆశీర్వదించడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. సెప్టెంబర్ 3న విడుదల కానున్న 'రోమాంచకం' ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story