Prabhas Darling Re Release: మహేష్, పవనే కాదు..ప్రభాస్‌ కూడా మొదలుపెట్టాడు...

Prabhas Darling Re Release: టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పాత సినిమాలను కొత్తగా మార్కెట్‌ చేస్తూ సరికొత్త బిజినెస్‌ చేస్తున్నారు సినీ నిర్మాతలు.

Balachander
Updated on: 22 April 2026 2:40 PM IST
Prabhas Darling Re Release
X

Prabhas Darling Re Release

Prabhas Darling Re Release: టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పాత సినిమాలను కొత్తగా మార్కెట్‌ చేస్తూ సరికొత్త బిజినెస్‌ చేస్తున్నారు సినీ నిర్మాతలు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బడా హీరోల సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాలు వరసగా రీ రిలీజ్‌ అవుతూ ఆపాత మధురాలను నెమరవేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బాటలో ప్రభాస్‌ కూడా పయనిస్తున్నాడు. ప్రభాస్‌ కెరీర్‌లో క్లాసిక్‌ లవ్‌స్టోరీగా నిలిచిన డార్లింగ్‌ సినిమా మళ్లీ వెండితెరపైకి వచ్చి రికార్డులు తిరగరాస్తోంది. కేవలం అడ్వాన్డ్స్‌ బుకింగ్స్‌ ద్వారానే ఈ సినిమా రూ. 2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

పద్నాలుగేళ్ల తర్వాతా అదే క్రేజ్!

తొలిప్రేమ వంటి కల్ట్‌ క్లాసిక్‌ లవ్‌స్టోరి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన డార్లింగ్ 2010లో విడుదలై యువతను ఉర్రూతలూగించింది. లవర్‌బాయ్‌గా డార్లింగ్‌ ప్రభాస్‌ యూత్‌ను ఆకట్టుకున్న సినిమా ఇది. ఇప్పుడు ప్రభాస్‌ అంటే గ్లోబల్‌ స్టార్‌. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన తరువాత కూడా ఆయనలోని పాత లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో రీ రిలీజైన ఈ మూవీ థియేటర్లు హౌస్‌ఫుల్‌ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అడ్వాన్స్‌ సేల్స్‌ రూపంలో రూ. 2 కోట్లు వసూలు కావడం విశేషం.

థియేటర్లలో పండగ వాతావరణం

ప్రభాస్ - కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ, జీవీ ప్రకాష్ అందించిన అద్భుతమైన సంగీతం థియేటర్లలో మళ్ళీ మారుమోగుతున్నాయి. 'నీవే' వంటి పాటలకు నేటి తరం యువత కూడా స్టెప్పులేయడం విశేషం. కేవలం అభిమానులే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రధాన థియేటర్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

రీ-రిలీజ్ రికార్డుల వేట

గతంలో పవన్ కళ్యాణ్ 'ఖుషి', మహేష్ బాబు 'బిజినెస్‌మెన్', 'మురారి' వంటి చిత్రాలు రీ-రిలీజ్‌లో భారీ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు 'డార్లింగ్' కూడా అదే బాటలో పయనిస్తూ టాప్ లీగ్‌లోకి చేరిపోయింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం మరిన్ని బెంచ్‌మార్క్ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ప్రయోగం సక్సెస్‌ అవుతుండటంతో ఈ బాటలో మరికొంతమంది హీరోలు నడిచే అవకాశం ఉంది.

సినీ ప్రేక్షకులకు సినిమా పాతదా కొత్తదా అనే అవసరం లేదు. కథ, కథనం, భావోద్వేగాలు అన్నీ సినిమాలో ఉంటే చాలు. ఎలాంటి సినిమా అయినా హిట్‌ కావాల్సిందే. థియేటర్లకు జనాలు రావాల్సిందే. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆయన క్లాసిక్ సినిమాలపై ప్రేక్షకులకు ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఈ వసూళ్లు నిరూపిస్తున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story