Fauji Glimpse : రెబల్ స్టార్ మాస్.. థియేటర్లు తగలబడిపోతాయ్!

Fauji Glimpse: రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ గ్లింప్స్ విడుదలైంది.

Gagan kumar
Published on: 24 Oct 2026 7:16 AM IST
Fauji Glimpse
X

Fauji Glimpse : రెబల్ స్టార్ మాస్.. థియేటర్లు తగలబడిపోతాయ్!

Prabhas Fauji Glimpse: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా మేకర్స్ విడుదల చేసిన అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలను ఈ గ్లింప్స్ తారాస్థాయికి చేర్చింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ , అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణతో ఈ గ్లింప్స్ ప్రారంభం కావడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. బ్రిటీష్ వారిని ఓడించడానికి జర్మనీ సహాయం కోరిన బోస్‌తో హిట్లర్ మాట్లాడిన సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇండియన్ల రక్తంలో బానిసత్వం ఉందని హిట్లర్ అనగా... బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒకే ఒక్క సైనికుడు ‘ఫౌజీ’ గురించి బోస్ వివరించే తీరు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

భగవద్గీత ఆధారంగా ఆ సైనికుడు సృష్టించిన కోడ్ ఎనిగ్మా కంటే ప్రమాదకరమని చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని విపరీతంగా పెంచేశాయి. వీడియో చివరిలో ప్రభాస్ మాస్ ఎంట్రీ ఇచ్చి, బ్రిటీష్ అధికారులను హెచ్చరిస్తూ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాను 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి రెబల్ స్టార్ సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేశాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.