Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ మూవీకి కొత్త రిలీజ్ డేట్.! ఆ సినిమాతో భారీ బాక్సాఫీస్ క్లాష్..!
Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లోని స్పిరిట్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ మూవీకి కొత్త రిలీజ్ డేట్.! ఆ సినిమాతో భారీ బాక్సాఫీస్ క్లాష్..!
Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు అది దీపావళికి వాయిదా పడింది. 2027 అక్టోబర్ 29వ తేదీన సినిమాను తొమ్మిది భాషల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రకటించారు. దీనిపై ప్రత్యేక పోస్టర్ను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇప్పటికే ఫౌజీ సినిమా డిసెంబర్ రేసు నుంచి తప్పుకోగా, ఇప్పుడు స్పిరిట్ విడుదల తేదీ కూడా దీపావళికి మారుతూ అఫిషియల్ అనౌన్స్మెంట్ రావడం విశేషం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ పనులు నిలకడగా సాగుతున్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
అటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం పార్ట్ 2 కూడా వచ్చే సంవత్సరం దీపావళికి రిలీజ్ కానుంది. దీంతో వచ్చే దీపావళికి ఈ రెండు భారీ సినిమాల బాక్సాఫీస్ క్లాష్ పక్కాగా మారింది. ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుండగా, హీరోయిన్గా త్రిప్తి దిమ్రి నటిస్తుండగా, విలన్గా వివేక్ ఒబెరాయ్ అలాగే కీలక పాత్రలలో ప్రకాష్ రాజ్, సీనియర్ నటి కాంచన నటిస్తున్నారు. కాగా, గుల్షన్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.




