‘డ్రాగన్’అసలు కథ ఇదే.. ప్రశాంత్ నీల్ ఓపెన్ స్టేట్‌మెంట్!
నా ప్రతి సినిమాలో నా చిన్ననాటి జ్ఞాపకాలే అతిపెద్ద ఎమోషన్‌గా మారుతుంటాయి. ‘డ్రాగన్’చిత్రానికి కూడా అదే నా బిగ్గెస్ట్ స్ట్రెంత్
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా విజువల్ వండర్ ‘డ్రాగన్’. ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. నేషనల్ వైడ్‌గా నంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. 2027లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ప్రశాంత్ నీల్ తాజాగా ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా సినిమా మెయిన్ స్టోరీ లైన్ అండ్ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్ చేసి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశారు.
బ్రిటిష్ కాలం నాటి డ్రగ్స్ మాఫియా..
సినిమా కథాంశం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “నా ప్రతి సినిమాలో నా చిన్ననాటి జ్ఞాపకాలే అతిపెద్ద ఎమోషన్‌గా మారుతుంటాయి. ‘డ్రాగన్’చిత్రానికి కూడా అదే నా బిగ్గెస్ట్ స్ట్రెంత్. నేను ఇప్పటివరకు చెప్పిన కథల కంటే ఇది చాలా కొత్తగా, మరింత సహజంగా , రూటెడ్‌గా ఉంటుంది. ఈ సినిమా కథ మొత్తం 1967 కాలం నాటి పీరియడ్ డ్రామాగా సాగుతుంది” అని తెలిపారు.
కథలోని అసలు ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ.. “బ్రిటిష్ పాలన సమయంలో , వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నడిచిన ఓపియం (నల్లమందు), హీరోయిన్ లీగల్ అండ్ ఇల్లీగల్ డ్రగ్స్ వ్యాపారం చుట్టూ ఈ కథను అల్లడం జరిగింది. ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల నేపథ్యంలో ఈ ప్రపంచాన్ని అత్యంత వాస్తవికంగా సృష్టించాం. నగరాలు చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక బలమైన హ్యూమన్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.
ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవేటెడ్ కాంబో
ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్ ఎలివేషన్స్, దానికి తోడు ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పర్‌ఫార్మర్ తోడవ్వడంతో ‘డ్రాగన్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘సలార్ 2’ కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి శరవేగంగా షూటింగ్ ముగించేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఎమోషన్ + మైండ్ బ్లోయింగ్ యాక్షన్:
ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో గోల్డ్ మైన్స్, ‘సలార్’లో కాన్సార్ సామ్రాజ్యాన్ని చూపిస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో 1960ల నాటి ముంబై, కోల్‌కతా పోర్ట్ డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యాన్ని చూపించబోతున్నారు.
ఈ మైండ్ బ్లోయింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 2027లో భారతీయ వెండితెరపై సరికొత్త రికార్డుల సృష్టికి సిద్ధమవుతోంది. ముంబై డ్రగ్ లార్డ్‌గా ఎన్టీఆర్ విశ్వరూపం చూడటానికి నందమూరి ఫ్యాన్స్ అప్పుడే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు!




