'డ్రాగన్' కోసం 15 కేజీల బరువు తగ్గిన తారక్.. ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు!
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
'డ్రాగన్' కోసం 15 కేజీల బరువు తగ్గిన తారక్.. ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు!
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 15 కేజీల బరువు తగ్గి సరికొత్త మేకోవర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ పడిన శ్రమను, ఆయన అంకితభావాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొనియాడారు.
చిన్న సలహాకే ఊహించని మేకోవర్
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. సినిమాలోని 'లూగర్' పాత్ర కోసం ఎన్టీఆర్ కొద్దిగా బరువు తగ్గితే బాగుంటుందని తాను ఒక చిన్న సలహా మాత్రమే ఇచ్చానని వెల్లడించారు. అయితే ఆ సూచనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, కేవలం కొద్ది కాలంలోనే ఏకంగా 15 కేజీల బరువు తగ్గి కఠినమైన శారీరక మార్పును సాధించారని చెప్పారు. పాత్ర పట్ల ఆయన చూపించిన ఈ అంకితభావం చూసి తాను షాక్ అయ్యానని, తారక్ ఈ క్యారెక్టర్ కోసం పూర్తిగా లీనమైపోయారని ప్రశాంత్ నీల్ ప్రశంసల వర్షం కురిపించారు.
యూట్యూబ్‌లో 'డ్రాగన్' సంచలనం
ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'డ్రాగన్' ప్రిల్యూడ్ గ్లింప్స్ సామాజిక మాధ్యమాలలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 1967 నాటి అంతర్జాతీయ నల్లమందు సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ లుక్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి, భారతీయ సినీ చరిత్రలో ఒకే ఛానెల్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్‌గా ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది.
క్రూరమైన పాత్రలో యంగ్ టైగర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చాలా డార్క్‌గా, వైల్డ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. నార్కోటిక్స్ బ్యూరో చీఫ్‌గా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తుండగా, రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. రవి బస్రూర్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం, ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




