Daayra: ఓటీటీలోకి మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్!
Daayra: హైదరాబాద్ దిశా ఘటన ఆధారంగా తెరకెక్కిన పృథ్వీరాజ్, కరీనా కపూర్ ల ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దాయిరా’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
Daayra: ఓటీటీలోకి మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్!
Daayra Netflix: ఓటీటీలోకి మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్..మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దాయిరా’. 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ 'దిశా' రేప్ అండ్ ఎన్‌కౌంటర్ సంఘటనతో పాటు కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎన్‌కౌంటర్ చేసిన సీనియర్ అధికారిగా కనిపిస్తే, ఆ ఎన్‌కౌంటర్ వెనుక ఉన్న నిజాలను బయటకు తీసే విజిలెన్స్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కరీనా కపూర్ మెప్పించారు. జితేంద్ర జోషి, కన్వల్జీత్ సింగ్, క్షితీ జోగ్ తదితరులు కీలక పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 18న హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా, చట్టం - న్యాయం మధ్య ఉండే సన్నని గీతను ఆవిష్కరిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకంది.
థియేటర్లలో ఉత్కంతభరిత కథనంతో ప్రేక్షకులను అలరించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నవంబర్ 13 నుండి ఈ క్రైమ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. సంచలనాత్మక వాస్తవిక ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ను థియేటర్లలో మిస్ అయినవారు నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.




