Priyadarshi: ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పోలిన పాత్ర.. మొదట వినగానే భయమేసింది..

Priyadarshi: ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పోలిన పాత్రకు నటుడు ప్రియదర్శిని ఎందుకు ఎంపిక చేశారో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు.

Ravi
By Ravi
Published on: 26 Sept 2026 7:27 PM IST
Priyadarshi
X

Priyadarshi: ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పోలిన పాత్ర.. మొదట వినగానే భయమేసింది..

Priyadarshi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రాలలో ప్యారడైజ్ సినిమా ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇక సినిమాలోని ఒక ప్రత్యేక పాత్ర ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను చిత్ర యూనిట్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పోలిన పాత్ర ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అయితే ఆ పాత్ర కోసం నటుడు ప్రియదర్శిని ఎందుకు ఎంపిక చేశారనే దానిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పష్టతనిచ్చారు. ఆ పాత్రలో ఎవరిని పెట్టాలని తాము చాలా వెతికాం అని ఆయన తెలిపారు. చివరికి ప్రియదర్శి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఆ గెటప్‌లో పెట్టి చూస్తే కరెక్ట్ ఉన్నాడని తేలిందని వెల్లడించారు. ఆ రోల్‌కు సంబంధించిన రీసెర్చ్ మొత్తం ప్రియదర్శి స్వయంగా తనే చేసుకున్నాడని ప్రశంసించారు.

ఈ పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే తనకు మొదట కొంత భయమేసిందని నటుడు ప్రియదర్శి తెలిపారు. అయితే దీన్ని ఒక గొప్ప సవాల్‌గా స్వీకరించి ఈ పాత్రను పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెరపై ఈ పాత్ర వస్తున్న సమయంలో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కేవలం నటన పరంగానే కాకుండా గెటప్ పరంగా కూడా ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.