Priyanka Chopra: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ ‘సింప్లిసిటీ’కి నెటిజన్లు ఫిదా!

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వినయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దేవాలయంలో సాధారణ భక్తురాలిలా గిన్నెలు కడుగుతూ సేవ చేస్తున్న ప్రియాంక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Arun Chilukuri
Published on: 1 April 2026 1:03 PM IST
Priyanka Chopra
X

Priyanka Chopra: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ ‘సింప్లిసిటీ’కి నెటిజన్లు ఫిదా!

Priyanka Chopra: వెండితెరపై గ్లామర్‌తో మెరిసిపోయే సెలబ్రెటీలు నిజ జీవితంలో ఎంత సింపుల్‌గా ఉంటారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక ప్రముఖ దేవాలయంలో ఆమె సాధారణ భక్తురాలిలా గిన్నెలు కడుగుతూ సేవ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా సెలబ్రెటీలు ఆలయాలకు వస్తే ప్రత్యేక దర్శనాలు, భారీ భద్రత మధ్య కనిపిస్తారు. కానీ ప్రియాంక మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, సాధారణ భక్తులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ వంటశాలలో గిన్నెలు కడగడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ భక్తిని చాటుకున్నారు. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం ఆమె చేసిన ఈ పనిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

నెట్టింట ప్రశంసల జల్లు

ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

"ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే" అని కొందరు కామెంట్ చేస్తుంటే..

"తను గ్లోబల్ స్టార్ అయినా తన భారతీయ మూలాలను, సంప్రదాయాలను అస్సలు మర్చిపోలేదు" అని మరికొందరు కొనియాడుతున్నారు.

రాజమౌళి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ?

ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story