ముద్దుల కూతురు మాల్తీ మేరీతో ప్రియాంక చోప్రా లండన్ టూర్..

Priyanka Chopra: ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా, తాజాగా తన లండన్ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను అలరించారు.

Srinivas Rao
Updated on: 13 July 2026 2:21 PM IST
Priyanka Chopra
X

ముద్దుల కూతురు మాల్తీ మేరీతో ప్రియాంక చోప్రా లండన్ టూర్..

Priyanka Chopra: ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా, తాజాగా తన లండన్ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను అలరించారు. బిజీ షెడ్యూల్‌లో కూడా ఫ్యామిలీ కోసం సమయం కేటాయించే ప్రియాంక, ఈసారి తన భర్త నిక్ జోనాస్, ముద్దుల కూతురు మాల్తీ మేరీలతో కలిసి లండన్‌లో ఎంజాయ్ చేసిన అద్భుతమైన క్షణాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

లండన్‌లో ఫ్యామిలీ టైమ్..

వింబుల్డన్ టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు, పాత స్నేహితులను కలవడం, అత్తగారు డెనిస్ జోనాస్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకమైన క్షణాలను ప్రియాంక ఈ ఫోటోల్లో బంధించారు. ముఖ్యంగా లండన్ వీధుల్లో తెల్లని డ్రెస్‌లో ప్రియాంక ఎంతో స్టైలిష్‌గా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఫోటో ప్రస్తుతం నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఇక ముద్దుల కూతురు మాల్తీ మేరీ స్ట్రైప్డ్ దుస్తులు, బ్లూ బకెట్ హ్యాట్‌లో ఎండను ఆస్వాదిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

లారా దత్తాతో రీ-యూనియన్..

వింబుల్డన్ వేదికపై తన 'అందాజ్' సహనటి లారా దత్తాతో కలిసి ప్రియాంక దిగిన ఫోటో అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. వీరిద్దరూ నవ్వుతూ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన అత్తామామలతో కలిసి ప్రియాంక గడిపిన క్షణాలను కూడా ఆమె ఎంతో ప్రేమగా షేర్ చేసుకున్నారు.

'వారణాసి'తో గ్రాండ్ కంబ్యాక్..

ప్రస్తుతం ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' తో ఆమె తిరిగి రానున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2027 ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story