Bandla Ganesh: ఆ సీనియర్ నటుడు నన్ను చెప్పుతో కొట్టాడు.. బండ్ల గణేష్ సంచలనం
Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రాజా రవీంద్ర పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి.
Bandla Ganesh: ఆ సీనియర్ నటుడు నన్ను చెప్పుతో కొట్టాడు.. బండ్ల గణేష్ సంచలనం
Raja Ravindra: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అంటేనే ఒక వైబ్రేషన్. సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉన్నప్పటికీ.. ప్రెస్ మీట్లలో ఆయన డైలాగులు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా ప్రముఖ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తోన్న రాజా రవీంద్ర టాక్స్ పాడ్‌కాస్ట్‌లో బండ్లన్న పాల్గొని, గతంలో తనకు జరిగిన ఒక ఘోర అవమానం గురించి బయటపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయన చాలా మంచివారే, నాకు ఎంతో సాయం కూడా చేశారు. కానీ ఆ రోజు ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో ఏమో తెలీదు. నాకు బాగా గుర్తుంది.. నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు అది. నేను, ఇంకొక నటుడు ఆయన పక్కనే కూర్చుని ఉన్నాం. మనకు అలవాటైనట్లే నేను సార్.. సార్.. అంటూ మాట్లాడుతున్నాను. అంతే.. ఏమైందో తెలీదు కానీ, సడెన్‌గా ఆయన చెప్పు తీసుకుని నన్ను కొట్టారు. నేను వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను అని బండ్ల గణేష్ సంచలన నిజాన్ని బయటపెట్టారు.
చెప్పుతో దెబ్బ తిని బయటకు వచ్చిన తర్వాత.. బండ్ల గణేష్ కుంగిపోకుండా, ఆ అవమానాన్నే తన సక్సెస్‌కు ఇంధనంగా మార్చుకున్నానని బండ్ల గణేష్ తెలిపారు. ఆ సమయంలో నాతో ఉన్న మరో వ్యక్తితో ఒకటే చెప్పా.. బాబాయ్.. నా దగ్గర డబ్బు లేదనే కదా ఆయన నన్ను చెప్పుతో కొట్టాడు. ఏదో ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా అని ఛాలెంజ్ చేశాను. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన నాకు సారీ చెప్పారు. కానీ, నేను అనుకున్నట్లే ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాను, అంతకంటే ఎక్కువ సంపాదించాను. అదే నా లైఫ్ అచీవ్‌మెంట్ అంటూ బండ్లన్న ఎమోషనల్ అయ్యారు. అయితే బండ్ల గణేష్ తనను అవమానించిన ఆ సీనియర్ నటుడు ఎవరో, ఆ పేరును మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు. అయితే, ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పెద్దాయన ఎవరు? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.




