Ram Charan: రామ్ చరణ్ - సుకుమార్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత!

Ram Charan: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్‌ను వై. రవి శంకర్ ప్రకటించారు.

Gagan kumar
Published on: 22 Oct 2026 1:36 PM IST
Ram Charan
X

Ram Charan: రామ్ చరణ్ - సుకుమార్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత!

Sukumar: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. వైవిధ్యమైన జోనర్లలో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బేనర్ తాజాగా “దొంగ నా కొడుకు” చిత్రంతో మరో నవ్వుల విందు ఇచ్చేందుకు సిద్ధమైంది. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాణంలో శ్రీను కంబాల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం సినీ వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వై. రవి శంకర్ సినిమా విడుదలకు సంబంధించిన కీలక తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. చిల్డ్రన్స్ డేకి ముందు వస్తుండటంతో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుందని, భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

యువ కథానాయకుడు మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గురించి చెబుతూ.. “లిటిల్ హార్ట్స్” తర్వాత మౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, టైటిల్‌కు తగ్గట్టుగానే అతని అల్లరి చిల్లరి పనులు, క్యారెక్టరైజేషన్ సినిమా అంతటా నవ్విస్తాయని పేర్కొన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ స్టైల్ గురించి రవి శంకర్ మాట్లాడుతూ.. తమ బేనర్‌లో వస్తున్న చిత్రాల వైవిధ్యాన్ని గర్వంగా పంచుకున్నారు. ఇదివరకు ఒక ఎమోషనల్ సినిమా వచ్చింది. ఆ వెంటనే వచ్చిన ‘రణబాలి’ ఒక చరిత్ర, ఒక ధీరుడి కథ.ఇప్పుడు ఈ శుక్రవారం రాబోయే ‘401’ ఒక హారర్ కథ. ఆ వెంటనే వచ్చే ‘దొంగ నా కొడుకు’ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్. ఇలా ప్రతీ జోనర్‌ను టచ్ చేస్తూ వరుస సినిమాలు వస్తుండటం మాకెంతో ఆనందాన్ని ఇస్తోంది అని తెలిపారు.

వెంట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రవి శంకర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ సినిమా నేపథ్యం , హీరో పాత్రను పరిచయం చేసేలా ఒక చిన్న గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇది “బాహుబలి” లాంటి భారీ అంచనాలతో కాకుండా, కేవలం సినిమా జోనర్ మరియు క్యారెక్టర్ ఎంట్రీని పరిచయం చేసేలా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ స్పెషల్ వీడియోను ఈ శుక్రవారం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘401’ సినిమాతో పాటు బిగ్‌స్క్రీన్‌పై చూడవచ్చని గుడ్ చెప్పారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న భారీ ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన స్పష్టతనిచ్చారు. వాస్తవానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలను దసరాకు అనుకున్నప్పటికీ, మూఢం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. అన్ని కుదిరితే అక్టోబర్ 26 లేదా 27న మంచి ముహూర్తం చూసి ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి.. ఒక వైపు వినోదాత్మక చిత్రాలు, మరోవైపు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ జోరు మామూలుగా లేదని చెప్పాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.