OTT: ఊహకందని ట్విస్టులు.. ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ ఎస్.సరస్వతి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
OTT: నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఎస్.సరస్వతి థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకీ సైకలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.? సినిమా కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OTT: ఊహకందని ట్విస్టులు.. ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ ఎస్.సరస్వతి. స్ట్రీమింగ్ ఎందులో అంటే.
OTT: నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఎస్.సరస్వతి థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకీ సైకలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.? సినిమా కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడ?
‘ఎస్. సరస్వతి’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్దగా ప్రచారం లేకుండానే ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడలేకపోయినవారికి ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూసే అవకాశం వచ్చింది. ఈ చిత్రాన్ని వరలక్ష్మి శరత్‌కుమార్ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆమెతో పాటు జీవా, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. నటీనటుల ప్రదర్శన, కథలోని ట్విస్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కథేంటంటే.?
ఈ సినిమా కథలో ముఖ్య పాత్ర లక్ష్మి. చిన్నప్పుడే అనాథ అయిన ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతుంది. తన జీవితంలో ఆనందానికి కారణం ఆమె కూతురు సరస్వతి. ఒకరోజు ఉదయం ఆమె తన కుమార్తెను స్కూల్లో దించి ఉద్యోగానికి వెళ్తుంది. కానీ సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆ చిన్నారి కనిపించదు. ఆందోళన చెందిన లక్ష్మి స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తుంది. అక్కడ ఆమెకు ఊహించని సమాధానం లభిస్తుంది. స్కూల్ రికార్డుల్లో సరస్వతి అనే విద్యార్థి అసలు లేదని వారు చెబుతారు. దీంతో లక్ష్మి పూర్తిగా అయోమయంలో పడుతుంది.
పోలీసుల ముందు సంచలన వాంగ్మూలం
ఈ ఘటన తర్వాత లక్ష్మి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంచలన విషయాన్ని చెబుతుంది. తన కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె ఆరోపిస్తుంది. అంతేకాదు, ఆ ఘటన తర్వాత ఆ శవాన్ని తానే ఒక ప్రదేశంలో పాతిపెట్టానని కూడా వెల్లడిస్తుంది. పోలీసులు ఆమె చెప్పిన ప్రదేశంలో తవ్వి చూసినా ఎలాంటి ఆధారాలు దొరకవు. శవం గానీ, ఇతర సాక్ష్యాలు గానీ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రారు. దీంతో లక్ష్మి న్యాయం కోసం మరింత తీవ్రంగా పోరాటం ప్రారంభిస్తుంది.
కోర్టులోనూ నిరాశ
న్యాయం కోసం లక్ష్మి ప్రముఖ న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్) సహాయంతో కోర్టును ఆశ్రయిస్తుంది. అయితే అక్కడ కూడా పరిస్థితి మారదు. ఎలాంటి ఆధారాలు లేకపోవడం కారణంగా కేసును కోర్టు కొట్టివేస్తుంది. ఈ నిర్ణయం లక్ష్మిని తీవ్రంగా కుంగతీస్తుంది. వ్యవస్థ తనకు న్యాయం చేయలేదనే భావన ఆమెను మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది.
తర్వాత జరిగే సంచలన ఘటనలు
కోర్టు తీర్పు తర్వాత లక్ష్మి తీసుకునే నిర్ణయాలు కథను పూర్తిగా మలుపుతిప్పుతాయి. తన కుమార్తె మరణానికి కారణమని భావించిన ముగ్గురు అధికారులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఒక జడ్జి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక పోలీస్ అధికారి హత్యకు గురవడం కథలో పెద్ద ట్విస్ట్‌గా మారుతుంది. దీంతో అసలు ప్రశ్నలు మొదలవుతాయి. లక్ష్మి చెప్పిన కథ నిజమేనా? సరస్వతి అనే చిన్నారి నిజంగా ఉందా? లక్ష్మి గతంలో ఏమి జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ఎస్. సరస్వతి’ సినిమా చూడాల్సిందే.




