Radhika Apte: సొంత కజిన్‌ను పెళ్లి చేసుకునే రోల్.. పెద్ద వయసు హీరోతో జోడీ.. టాలీవుడ్‌పై రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Radhika Apte: తెలుగు సినీ పరిశ్రమపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పాత్ర తెలిసి నటించి విమర్శలేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Radhika Apte: సొంత కజిన్‌ను పెళ్లి చేసుకునే రోల్.. పెద్ద వయసు హీరోతో జోడీ.. టాలీవుడ్‌పై రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Radhika Apte: తెలుగు సినీ పరిశ్రమపై నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'ఓ సినిమాలో సొంత కజిన్‌ను, మరో మూవీలో వయసులో పెద్దవారైన నటుడిని పెళ్లి చేసుకునే పాత్రకు అడిగారు. సౌత్ఇండస్ట్రీలో లోకల్ వాళ్లకంటే తెల్లగా ఉండే నార్త్ భామలకే ప్రాధాన్యం ఇస్తున్నారు' అని ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆ మూవీలో తన పాత్ర సగంలోనే చనిపోయిందని కూడా ఆమె చెప్పారు. ఈ కారణంతోనే దక్షిణాది సినిమాలకు దూరంగా ఉంటున్నానని, ప్రత్యేకంగా తన అవసరం ఉన్న ప్రాజెక్ట్ అయితేనే చేస్తానని చెప్పారు.
పాత్ర గురించి తెలిసి నటించి ఇప్పుడు విమర్శలు చేయడమేంటని ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె ప్రస్తావించిన సినిమా 2014లో వచ్చిన 'లెజెండ్' అని నెటిజన్లు అంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28, 2014న రిలీజైంది.
ఇందులో జగపతిబాబు విలన్‌గా, రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అయితే రాధికా సినిమా పేరును స్వయంగా వెల్లడించలేదు. మరోవైపు కొందరు ఆమె మాటలను సమర్థిస్తూ, తెలుగు సినిమాలో చాలాకాలం తెల్లని రంగును హీరోయిన్‌కు అర్హతగా చూశారని కామెంట్లు చేస్తున్నారు.
రాధికా ఆప్టే రెండు దశాబ్దాల కెరీర్‌లో రజనీకాంత్ 'కబాలి', బాలకృష్ణ 'లయన్', 'వెట్రి సెల్వన్' లాంటి దక్షిణాది సినిమాల్లో నటించారు. ఆమె చివరి సౌత్ చిత్రం 'చిత్తిరం పేసుతడి 2' షూటింగ్ పూర్తయిన ఆరేళ్లకు రిలీజైంది. ప్రస్తుతం కీర్తి సురేష్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ 'అక్క'లో నటిస్తున్నారు.




