SS Rajamouli: RRR కంటే 'వారణాసి' 6 రెట్లు పెద్దది..!
SS Rajamouli: ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం 'వారణాసి' RRR కంటే 6 రెట్లు పెద్దదని, పక్కా పేపర్‌వర్క్‌తో కేవలం 275 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామని రాజమౌళి తెలిపారు.
SS Rajamouli: RRR కంటే 'వారణాసి' 6 రెట్లు పెద్దది..!
Varanasi Movie: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిచెప్పిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. గ్లోబల్ వైడ్‌గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గురించి ఇటీవల బ్రెజిల్‌లోని 50వ 'సావో పాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్'లో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రాజెక్ట్ స్కేల్ పరంగా చూస్తే 'వారణాసి' చిత్రం ఆర్ఆర్ఆర్ కంటే ఆరు రెట్లు పెద్దదని రాజమౌళి తెలిపారు. అయినప్పటికీ, పక్కా పేపర్‌వర్క్, పూర్తి ప్రిపరేషన్‌తో షూటింగ్‌కు వెళ్లడం వల్ల తక్కువ రోజుల్లోనే దీనిని పూర్తి చేయగలిగామని చెప్పారు. RRR షూటింగ్‌కు 315 రోజులు సమయం పడితే.. వారణాసి షూటింగ్‌కు కేవలం 275 రోజులు మాత్రమే పట్టిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.
RRR చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూశారని, అందులో తప్పేమీ లేనప్పటికీ ఓ ఫిలిం మేకర్‌గా తన సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో పెద్ద తెరపై చూడాలనే కోరుకుంటానని రాజమౌళి వ్యాఖ్యానించారు. 'వారణాసి' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమా పూర్తయిన తర్వాత తనకు వచ్చిన హాలీవుడ్ ఆఫర్ల గురించి ఆలోచిస్తానని వెల్లడించారు.
ప్రధానంగా ప్రేమకథ, తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ఆధారంగా సాగుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటూనే, మరోవైపు గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించిన ఈ చిత్రాన్ని 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఘనంగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి వెల్లడించారు. గ్లోబల్ సెన్సేషన్ RRR తర్వాత రాజమౌళి అందిస్తున్న ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




