Rajesh Sharma: 'ఫౌజీ' షూటింగ్ సెట్‌లో అపశృతి… నటుడికి విషపు కాటు!

Rajesh Sharma: చాలాసార్లు మనం ఏదైనా చిన్నపాటి గాయమైతే పెద్దగా పట్టించుకోము కదా? కానీ నటుడు రాజేష్ శర్మ విషయంలో అదే పెద్ద పొరపాటు అయ్యింది.

Srinivas Rao
Published on: 9 July 2026 2:01 PM IST
Rajesh Sharma
X

Rajesh Sharma: 'ఫౌజీ' షూటింగ్ సెట్‌లో అపశృతి… నటుడికి విషపు కాటు!

Rajesh Sharma: చాలాసార్లు మనం ఏదైనా చిన్నపాటి గాయమైతే పెద్దగా పట్టించుకోము కదా? కానీ నటుడు రాజేష్ శర్మ విషయంలో అదే పెద్ద పొరపాటు అయ్యింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ సినిమా షూటింగ్‌లో ఉండగా జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు ఆయనను ఆసుపత్రి పాలు చేసింది.

ఏం జరిగింది? రాజేష్ శర్మ కుటుంబ సభ్యుల తరపున నటి సుదీప ఛటర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగిసిన తర్వాత, రాజేష్ శర్మ అక్కడ ఉన్న టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా ఒక కీటకం కాటు వేసింది. మొదట ఆ గాయం చిన్నదేనని భావించిన రాజేష్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆరు గంటల వ్యవధిలోనే ఆయన కుడి కాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది.

తీవ్రమైన లక్షణాలు.. ఆందోళనలో కుటుంబం

నొప్పి పెరగడంతో పాటు రాజేష్ శర్మకు జ్వరం కూడా వచ్చింది. ఆ పరిస్థితిలోనే ఆయన కోల్‌కతాకు ప్రయాణమయ్యారు. విమాన ప్రయాణంలోనే ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో, కోల్‌కతా చేరుకోగానే మంగళవారం ఆయనను ధాకురియాలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, కుడి కాలిలో ఇన్ఫెక్షన్ మోకాలి వరకు వ్యాపించిందని వైద్యులు తెలిపారు. కాలిపై పెద్ద పెద్ద బొబ్బలు రావడంతో ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వైద్యుల పర్యవేక్షణలో..

రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, "ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము. ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ఇంకా ఆయన ప్రమాదం నుండి బయటపడలేదు" అని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటన జరగడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story