Jailer 2: రజినీ మేనియా.! రికార్డులను బ్రేక్ చేస్తున్న జైలర్ 2..

Jailer 2: రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా బుక్ మై షోలో వరుసగా నాలుగు రోజులు మిలియన్‌కు పైగా టికెట్స్ బుకింగ్ అయిన చిత్రాల లిస్టులో చేరింది.

Ravi
By Ravi
Published on: 19 Oct 2026 10:04 PM IST
Jailer 2
X

Jailer 2: రజినీ మేనియా.! రికార్డులను బ్రేక్ చేస్తున్న జైలర్ 2..

Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా సాధించిన అరుదైన ఫీట్ ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ నటించిన జైలర్ 2 అరుదైన ఫీట్ సాధించింది. బుక్ మై షోలో వరుసగా నాలుగు రోజులు మిలియన్‌కు పైగా టికెట్స్ బుకింగ్ అయిన చిత్రాల లిస్టులో ఈ సినిమా చేరింది. ఈ జాబితాలో కల్కి, పుష్ప 2, కాంతార 2, ధురంధర్ 2 ఉన్నాయి. ఇందులో కల్కి మినహా మిగతా చిత్రాలు సీక్వెల్స్ కావడంతో పాటు ప్రీక్వెల్స్ కావడం మరో ప్రత్యేక విశేషంగా నిలిచింది. ఈ రికార్డు ట్రేడ్ వర్గాలను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.

అటు ఐదు రోజుల్లో జైలర్ 2 మూవీ రూ. 420 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కురిపిస్తున్న కలెక్షన్ల వర్షం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో చిత్ర యూనిట్ అలాగే అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో కూడా ఈ చిత్రానికి భారీ ఎత్తున ఆదరణ లభిస్తోందని సమాచారం అందుతోంది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు టాలీవుడ్ అలాగే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. హిందీలో కూడా సరైన ప్రమోషన్స్ చేసి ఉంటే.. కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉండేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు మలయాళంలోనూ మంచి రన్ అవుతున్న ఈ సినిమా.. బాహుబలి 2 రికార్డుపై కన్నేసింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.