Rajinikanth: ఐదేళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబో!
Rajinikanth: రజనీకాంత్ 173వ చిత్రం 'ధర్మన్'లో లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్రలో నటిస్తున్నారు.
Rajinikanth: ఐదేళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబో!
Rajinikanth & Nayanthara: సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో 173వ మైలురాయిగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ‘ఓ మై కడవులే’, 'డ్రాగన్' చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ భారీ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మ్యాసివ్ కాస్టింగ్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీలోకి ‘లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రజనీకాంత్ సరసన నయనతార నటిస్తుండటంతో అభిమానుల్లో కోలాహలం నెలకొంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘చంద్రముఖి’, ‘కుసేలన్’, ‘దర్బార్’, ‘పెద్దన్న’ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు నయనతార కోసం కథను మలుపు తిప్పే అత్యంత బలమైన పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం అతిథి పాత్రలా కాకుండా, సినిమా ఫస్టాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ప్లాన్ చేశారట. తలైవాతో నయన్ షేర్ చేసుకోబోయే స్క్రీన్ స్పేస్ థియేటర్లలో విజిళ్లు వేయించడం ఖాయమని కోలీవుడ్ సమాచారం. తన సుదీర్ఘ నట ప్రస్థానంలో రజనీకాంత్ ఎప్పుడూ కనిపించని విధంగా తొలిసారిగా మెడికల్ ప్రొఫెసర్ పాత్రలో దర్శనమివ్వనున్నారు.
పగటిపూట నిస్వార్థంగా రోగుల ప్రాణాలు కాపాడే సీనియర్ ప్రొఫెసర్‌గా.. అన్యాయాలను అణచివేసే సమయంలో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రక్షకుడిగా రజనీ మార్క్ స్వాగ్, యాక్షన్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
ఈ సినిమాలో నయనతారతో పాటు సిమ్రాన్, రాశీ ఖన్నా, శ్రీలీల, రామ్ పోతినేని వంటి టాప్ స్టార్లు కీలక పాత్రల్లో మెరవనుండటంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా ‘ధర్మన్’ నిలిచింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న మ్యూజిక్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లనుంది. రజనీ-కమల్-అశ్వత్-నయన్ కాంబో బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.




