Ram Charan: ‘పెద్ది’ సెన్సార్ రివ్యూ..బొమ్మ దద్దరిల్లిపోయింది..!
Ram Charan: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'యూ/ఏ' సర్టిఫికేట్ లభించింది.
Ram Charan: ‘పెద్ది’ సెన్సార్ రివ్యూ..బొమ్మ దద్దరిల్లిపోయింది..!
Peddi Movie: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌ను షేక్ చేయగా.. తాజాగా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చి ఫ్యాన్స్‌లో అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్
‘పెద్ది’ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దాదాపు 3 గంటలకు పైగా సుదీర్ఘ నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్‌ను, రామ్ చరణ్ నటనను చూసి అవాక్కయ్యారట. ముఖ్యంగా సినిమా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని సెన్సార్ టాక్. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రికెట్, కుస్తీ సన్నివేశాలు, వాటితో ముడిపడిన ఎమోషన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట. రామ్ చరణ్ తన వన్‌మ్యాన్ షోతో కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ తీవ్రమైన గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమ్మర్ సీజన్‌లో థియేటర్లన్నీ వెలవెలబోయాయి. బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించే ఒక్కటంటే ఒక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా రాలేదు. హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సైతం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేసిన ఈ క్లిష్ట సమయంలో, ఇండస్ట్రీకి ఉన్న ఒకే ఒక్క ఆశ ‘పెద్ది’. సెన్సార్ నుంచి వినిపిస్తున్న పాజిటివ్ రిపోర్ట్స్ గనుక నిజమైతే, గత ఐదు నెలలుగా బాక్సాఫీస్ వద్ద ఉన్న కరువు తీరిపోవడం ఖాయం. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతూ, జూన్ 4న బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఒకేసారి అథ్లెట్‌గా, క్రికెటర్‌గా, రెజ్లర్‌గా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి దేశవ్యాప్త స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ‘పెద్ది’.. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.




