Ram Charan: రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీలో ధురంధర్ బ్యూటీ.? అమ్మడు జాక్‌పాట్ కొట్టేసిందిగా..

Ram Charan: 'ధురంధర్' ఫ్రాంచైజీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సారా అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Ravi
By Ravi
Published on: 20 Aug 2026 10:22 AM IST
Ram Charan
X

Ram Charan: రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీలో ధురంధర్ బ్యూటీ.? అమ్మడు జాక్‌పాట్ కొట్టేసిందిగా..

Ram Charan: 'ధురంధర్' ఫ్రాంచైజీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సారా అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న RC17 మూవీలో రామ్‌చరణ్ సరసన నటించనున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ధురంధర్' ఫ్రాంచైజీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనుందని సమాచారం.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ అలాగే సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ సర్కిల్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే అంశంపై గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. కైరా అద్వానీ, రష్మిక మందన్నా అలాగే రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి సారా అర్జున్ పేరు వచ్చి చేరింది.

దసరా నుంచి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పలువురు నటీనటుల పేర్లు వినిపించినప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సుకుమార్ టేకింగ్, రామ్‌చరణ్ మాస్ ఇమేజ్ కలిపి ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. వీరిద్దరి కాంబోలో ఇదివరకు వచ్చిన 'రంగస్థలం' సినిమా రేంజ్‌లో ఈ మూవీ కూడా ఉంటుందని తెలుస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story