రిలీజ్‌కు ముందే యూఎస్‌లో ‘పెద్ది’ వీరవిహారం.. రామ్ చరణ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’.
రిలీజ్‌కు ముందే యూఎస్‌లో ‘పెద్ది’ వీరవిహారం.. రామ్ చరణ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ . జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం.. రిలీజ్‌కు వారం రోజుల ముందే ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికా (USA & Canada) టెరిటరీలో 'పెద్ది' ముందస్తు బుకింగ్స్ సునామీ సృష్టిస్తున్నాయి.
ప్రీ-సేల్స్‌లోనే హాఫ్ మిలియన్ మార్క్ దాటేసిన చరణ్!
నార్త్ అమెరికాలో జూన్ 3న పడబోయే ప్రతిష్టాత్మక ప్రీమియర్ షోలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ అల్ట్రా స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. కేవలం ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ చిత్రం 575K డాలర్ల (రూ. 4.75 కోట్లకు పైగా) సాలిడ్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇప్పటికే అక్కడ 20,000 పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రీమియర్స్‌కు ఇంకా దాదాపు వారం రోజుల సమయం ఉండటంతో, ఈ నెంబర్ రిలీజ్ నాటికి ఊహించని రేంజ్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత రామ్ చరణ్‌కు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉందో ఈ వసూళ్లే నిరూపిస్తున్నాయి.
'పెద్ది' వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రానుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
టాలీవుడ్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల వివాదం మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సానుకూలంగా ముగియడం, అటు యూఎస్‌లో బుకింగ్స్ రికార్డులు బద్దలు కొడుతుండటంతో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సర్వం సిద్ధమైంది!




