Tollywood: రామ్ చరణ్‌కు జోడీగా ఆకాశంలో ఒక 'తార'.! RC17 హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి.?
Tollywood: సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి ఖరారైనట్లు టాక్, రేపే పూజా కార్యక్రమం నిర్వహించనున్నారట.
Tollywood: రామ్ చరణ్‌కు జోడీగా ఆకాశంలో ఒక 'తార'.! RC17 హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి.?
Tollywood: సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి ఖరారైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మూవీ టీమ్ ఈ తెలుగు అమ్మాయి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం రేపు జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న RC17 షూటింగ్ డిసెంబర్‌లో మొదలుకానుంది. అయితే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఈ ప్రాజెక్ట్ హీరోయిన్ విషయంలో ఇంతకుముందు చాలా పేర్లు వినిపించాయి. మొదట ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ పక్కన ఆమె చిన్నగా కనిపిస్తుందనే ఆలోచనతో మేకర్స్ ఇతర ఆప్షన్లను పరిశీలించినట్లు సమాచారం. ఆ తర్వాత సయ్యారా ఫేమ్ అనీత్ పడ్డా పేరు తెరపైకి వచ్చింది. అనస్వర రాజన్ పేరు కూడా ఈ జాబితాలో వినిపించింది. ఇప్పుడు సాత్విక పేరు తాజాగా చేరింది. ఈ పేర్లలో ఎవరిని సుకుమార్ ఫైనల్ చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది.
కాగా సాత్విక వీరవల్లి దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఆమెకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చిందన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.




