RGV: సినిమాల వల్లే హింస పెరుగుతోంది.! RGV ఆసక్తికర ట్వీట్..

RGV: సినిమాల వల్లే హింస పెరుగుతోందన్న వాదనలకు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Ravi
By Ravi
Published on: 1 Nov 2026 7:49 PM IST
RGV
X

RGV: సినిమాల వల్లే హింస పెరుగుతోంది.! RGV ఆసక్తికర ట్వీట్..

RGV: సినిమాల వల్లే సమాజంలో హింస పెరుగుతోందన్న వాదనలకు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. 'హింస పెరగడానికి సినిమాలను నిందించడం అనేది, కిడ్నాప్‌లు పెరగడానికి రామాయణాన్ని నిందించడం లాంటిదే' అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. సినిమాలపై వస్తున్న విమర్శలు సరైన దిశలో లేవన్నది ఆయన అభిప్రాయం అని చెప్పకనే చెప్పారు.

అనంతపురం జిల్లా రాప్తాడులోని ఓ పాఠశాలలో జరిగిన రంపం దాడి నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. 10వ తరగతి చదువుతున్న బాలికపై 21 ఏళ్ల యువకుడు తరగతి గదిలోకి వచ్చి దాడి చేశాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. బాధితురాలు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం నిందితుడు బాధితురాలికి బంధువని, ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఆర్జీవీ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ ఘటన తర్వాత సినిమాల్లోని హింసాత్మక సీన్లపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. 'యానిమల్' సినిమాలో రణ్‌బీర్ కపూర్ తుపాకీతో పాఠశాల తరగతి గదిలోకి వెళ్లే సన్నివేశాన్ని కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను విమర్శిస్తున్నారు. హింసను పురుషత్వానికి చిహ్నంగా చూపించడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.