Bhagyashri Borse: మొత్తానికి రామ్ పోతినేనిపై ఓపెనైన భాగ్యశ్రీ బోర్సే ..త్వరలోనే చెబుతానంటూ
Ram Pothineni: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.
Bhagyashri Borse: మొత్తానికి రామ్ పోతినేనిపై ఓపెనైన భాగ్యశ్రీ బోర్సే ..త్వరలోనే చెబుతానంటూ
Ram Pothineni: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన 'లెనిన్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇండస్ట్రీలోని టాప్ హీరోల గురించి, తన కో-స్టార్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన గుసగుసల ప్రశ్నలకు భాగ్యశ్రీ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తాను పనిచేసిన స్టార్ హీరోలలో ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ,అలవాట్లు ఎలా ఉంటాయో భాగ్యశ్రీ బోర్సే తనదైన శైలిలో బయటపెట్టారు.
తాను చూసిన హీరోల్లో శివకార్తికేయన్ అత్యంత క్రమశిక్షణ గల హీరో అని కొనియాడారు. మాస్ మహారాజా రవితేజ సెట్స్‌లో ఉంటే నవ్వుల పూత పూయాల్సిందేనని, ఆయనొక బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్ అని చెప్పుకొచ్చారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ అందరికంటే మోస్ట్ స్టైలిష్ పర్సన్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కినేని అఖిల్ ఏదైనా విషయాన్ని చాలా శ్రద్ధగా వింటారని, ఆయనొక బెస్ట్ లిజనర్ అని అన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన ఫోన్‌ను ఎక్కడో ఒకచోట మర్చిపోతుంటాడంటూ సరదాగా జోక్ చేశారు.
అయితే వీరందరికంటే ఎక్కువగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి భాగ్యశ్రీ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రామ్ పోతినేని చాలా వరకు నా థెరపిస్ట్ లాంటి వాడు అంటూ భాగ్యశ్రీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. మనసులోని మాటలను పంచుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి రామ్ ఎప్పుడూ తోడుంటాడనే అర్థంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
గత కొంతకాలంగా రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్‌లో మునిగితేలుతున్నారంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో రామ్‌ను నా థెరపిస్ట్ అని సంబోధించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లయింది. అంతేకాకుండా, రామ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారని.. ఖచ్చితంగా తమ కాంబినేషన్‌లో త్వరలోనే మరో సినిమా వస్తుందని భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చారు.




