Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామాలు.. షాలిని కాళ్లు పట్టుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అడుగుపెట్టిన తర్వాత ఆట మరింత ఆసక్తికరంగా మారింది.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అడుగుపెట్టిన తర్వాత ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఐదో వారంలో అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి వెళ్ళిపోగా, తాజాగా ఐదుగురు కొత్త సభ్యులు లోపలికి వచ్చి ఆటను పూర్తిగా మార్చేశారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక టాస్క్ హౌస్‌లో పెద్ద రచ్చకు దారితీసింది. పాత, కొత్త సభ్యుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఇచ్చిన బిరుదులు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా 38వ రోజు హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఓజీ సభ్యుల ప్రవర్తన ఆధారంగా ప్రత్యేక క్యారెక్టర్ పేర్లు ఇవ్వాలని బిగ్ బాస్ సూచించారు. వైల్డ్ కార్డ్ సభ్యులు అంతా చర్చించుకుని హౌస్‌లోని సభ్యులకు డ్రామా కింగ్, సేఫ్ ప్లేయర్, మ్యాన్యుపులేటర్ వంటి బిరుదులు కేటాయించారు. తమది కాని విషయంలోకి దూరి డ్రామా క్రియేట్ చేస్తాడనే కారణంతో రోహిత్‌ను డ్రామా కింగ్‌గా డిసైడ్ చేశారు. చిన్న చిన్న సమస్యలకే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ సింపతీ కొట్టేయాలని చూస్తోందని షాలినిని పేర్కొన్నారు. అలాగే ఝాన్సీని బ్యాక్ స్టాబర్గా, దెబ్జానీని సేఫ్ ప్లేయర్‌గా, వర్షిణిని బ్రెయిన్ లెస్ అని, త్రిగుణ్ ను మ్యాన్యుపులేటర్గా నిర్ణయించారు.
రామకృష్ణ క్షమాపణలు
ఈ సీక్రెట్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ ఓజీ సభ్యులను బ్లూ, గ్రీన్ టీమ్‌లుగా విభజించి ఒక ఆసక్తికరమైన గేమ్ నిర్వహించారు. గంట ముందుగా మోగించి బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఈ గేమ్‌లో తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు జరిగిన ఒక టాస్క్‌లో రామకృష్ణ తనను నెట్టేశాడని షాలిని తీవ్రంగా ఆరోపించింది. రోహిత్ వద్దకు వెళ్లి ఏడ్చిన షాలిని రచ్చ రచ్చ చేసింది. తాను కావాలని నెట్టలేదని రామకృష్ణ వివరణ ఇచ్చినా ఆమె శాంతించలేదు. పరిస్థితి మరింత ముదరడంతో రామకృష్ణ ఏకంగా షాలిని కాళ్లు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. చివరకు శివ కుమార్ రంగప్రవేశం చేసి ఆ సమస్యను సద్దుమణిగేలా చేశారు.
డేంజర్ జోన్లో ఎవరు?
వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా హీట్‌గా సాగింది. ఈ ఆరోవారంలో షాలిని, వర్షిణి, వంశీ, రాంప్రసాద్, అమన్, రోహిత్ మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లలో నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న అన్-అఫీషియల్ పోల్స్ ప్రకారం రోహిత్ భారీ ఓట్లతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ రెండో స్థానంలో ఉండగా, కామనర్ అమన్ మూడో స్థానంలో, టెంపర్ వంశీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక యాంకర్ వర్షిణి, ఫైర్ బ్రాండ్ షాలిని చివరి స్థానాలలో నిలిచి డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషనల్ డ్రామాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే ఆదివారం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.




