Ramayana box office: రామాయణం బాక్సాఫీస్ సునామీ.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్..!

Ramayana box office: భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ దూసుకుపోతోంది మన పౌరాణిక అద్భుతం ‘రామాయణం’.

Gagan kumar
Published on: 17 Nov 2026 11:48 AM IST
Ramayana box office
X

Ramayana box office: రామాయణం బాక్సాఫీస్ సునామీ.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్..!

Ramayana movie records : భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో.. బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ అడుగుల కింద నొక్కుకుంటూ దూసుకుపోతోంది మన పౌరాణిక అద్భుతం ‘రామాయణం’. విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్‌పై దండయాత్ర మొదలుపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు కేవలం 12 రోజుల్లోనే ఏకంగా రూ. 1,415.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ 12 డేస్‌లో ఇన్ని వేల కోట్లు కొల్లగొట్టిన ఏకైక చిత్రంగా ‘రామాయణం’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అసలు వీక్ డేస్ అనే మాటే లేకుండా.. సోమవారం నుంచి శుక్రవారం వరకు థియేటర్ల వద్ద అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ హవా ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. ఇప్పటికే రూ.1,400 కోట్ల మార్కును అవలీలగా దాటేసిన ఈ చిత్రం.. రేపటితో రన్ ముగిసేసరికి సరిగ్గా రూ. 1,500 కోట్ల ప్రతిష్టాత్మక క్లబ్‌లోకి అడుగుపెట్టబోతోంది. సినీ విశ్లేషకులు సైతం ఈ రేంజ్ కలెక్షన్లను చూసి షాక్ అవుతున్నారు.

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘రామాయణం’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.

తొలి 12 రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్ల పరంగా చూస్తే.. ‘రామాయణం’ సృష్టించిన రికార్డులు వేరే లెవెల్ అని చెప్పాలి. రీసెంట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2’ చిత్రం తన మొదటి 12 రోజుల్లో రూ. 1,392 కోట్లు వసూలు చేస్తే.. మన ‘రామాయణం’ ఏకంగా రూ. 1,415.75 కోట్లతో దానిని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఒకసారి టాప్ సినిమాల తొలి 12 రోజుల కలెక్షన్ల లిస్ట్ చూస్తే.. గూస్‌బంప్స్ రావాల్సిందే..

రామాయణం: రూ. 1,415.75 కోట్లు

ధురంధర్ 2 : రూ. 1,392 కోట్లు

పుష్ప 2: ది రూల్ : రూ. 1,334.86 కోట్లు

బాహుబలి 2 : రూ. 1,200 కోట్లు

ఆర్ఆర్ఆర్ : రూ. 950 కోట్లు

కేజీఎఫ్ చాప్టర్ 2 : రూ. 915 కోట్లు

జవాన్ : రూ. 884 కోట్లు

కల్కి 2898 ఏడీ : రూ. 855 కోట్లు

‘పుష్ప 2’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’ లాంటి బాక్సాఫీస్ రారాజులైన పాన్-ఇండియా సంచలనాలను సైతం వెనక్కి నెట్టి ‘రామాయణం’ నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది.రేపటితో రూ. 1,500 కోట్ల క్లబ్‌లో అఫీషియల్‌గా చేరిన తర్వాత.. ఈ చిత్రం లాంగ్ రన్‌లో ఇంకెన్ని అసాధ్యమైన రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.